Begin typing your search above and press return to search.
పవన్ కు జగన్ ఫోబియో పట్టుకున్నట్లుందే?
By: Tupaki Desk | 6 Dec 2017 4:57 PM ISTపవన్ కల్యాణ్ తో ఒక పెద్ద ఇబ్బంది ఉంది. అతడి నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో రాజకీయాలకు సంబంధించి ఆయనకున్న పరిమితుల్ని కప్పిపుచ్చుకోవటానికి పవన్ చెప్పే మాటలు మహా చిత్రంగా ఉంటాయి. సీజనల్ పొలిటీషియన్ల వ్యవహరిస్తూ.. తనకు తోచినప్పుడు బయటకు రావటం కనిపిస్తుంది. రాజకీయ నాయకుడు అనే వాడు ఉదయం.. సాయంత్రం రాజకీయాలు మాత్రమే చేయాలని చెప్పటం లేదు. కానీ.. ఎంతోకొంత కంటిన్యుటీ ఉండాలి.
నేనేం చెప్పాలో అది చెబుతా. అది కూడా.. నాకు నచ్చినప్పుడు మాత్రమే అన్న దగ్గరే పవన్ తో ఇబ్బంది అంతా. సర్లే.. అని ఊరుకుందామా? అంటే.. టైం కుదురినప్పుడు బయటకు వచ్చి రాజకీయాలు చేసే పవన్ కల్యాణ్.. తన ప్రసంగాల్లో అప్రయత్నంగా అన్నట్లు ఏపీ విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తుంటారు.
తనకు భయం లేదంటూనే.. జగన్ ను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సాపేక్షంగా ఉంటా.. తప్పు ఎవరిదైతే వారిని నిలదీస్తానని చెప్పే పవన్.. ఏపీ పాలకుల తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో పక్షపాతాన్ని ప్రదర్శిస్తారని చెప్పాలి.
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో పెరిగిన అవినీతి.. భారీ అప్పు గురించి ఒక్కరోజంటే ఒక్కరోజుకూడా మాట్లాడని పవన్.. అందుకు భిన్నంగా తన ప్రతి ప్రసంగంలోనూ ప్రతిపక్ష నేత జగన్ ను ఉద్దేశించి ఏదో రీతిలో వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. ఎక్కడి దాకానో ఎందుకు.. తాజాగా విశాఖలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరణ చేస్తారన్న అంశంపై గళం విప్పిన పవన్.. అవసరం లేకున్నా జగన్ ప్రస్తావన తీసుకురావటం కనిపిస్తుంది.
ప్రతి సమస్యు పరిష్కారం సీఎం అయ్యాకే అంటూ చేసిన వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలో లేని విపక్ష నేత గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
కానీ.. అందుకు భిన్నంగా జగన్ ను ఉద్దేశించి మాట్లాడిన పవన్ ను చూస్తే.. అనిపించేది ఒక్కటే జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన జనసేనాధినేతను ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పక తప్పదు. తన పాదయాత్ర ప్రారంభం నుంచి జగన్ తన దృష్టికి వస్తున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు సమస్యను ఎలా డీల్ చేస్తామో చెబుతున్నారు.
ప్రజల సమస్యల్ని తీర్చటానికి అధికారం అక్కర్లేదంటూ సూత్రీకరించే పవన్.. తాను ప్రతిసారీ బయటకు వచ్చినంతనే సమస్యల్ని తీర్చాలని అడిగేది పవర్ లో ఉన్న ప్రభుత్వాన్నే కానీ మరొకరిని కాదు. అలాంటప్పుడు ప్రజాసమస్యల్ని తీర్చేందుకు పవర్ అవసరం లేదన్నట్లుగా మాట్లాడే పవన్ మాటలకు అర్థం లేదు. మరి.. అలా ఎందుకు మాట్లాడుతున్నారన్న అంశంలోకి వెళితే.. జగన్ ఫోబియో పవన్ లో పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన.. తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాల విషయంలో జగన్ చేస్తున్నస్పష్టమైన ప్రకటనలు పవన్ చేత మాట్లాడించాయని చెప్పక తప్పదు.