Begin typing your search above and press return to search.

ఆ త‌ప్పే నిషిత్ ఫ్రాణాల్ని తీసింద‌ట‌!!

By:  Tupaki Desk   |   12 May 2017 4:31 AM GMT
ఆ త‌ప్పే నిషిత్ ఫ్రాణాల్ని తీసింద‌ట‌!!
X
ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిషిత్ కారు ప్ర‌మాదంపై ఉన్న‌తాధికారులు స్వ‌యంగా విశ్లేషించారు. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి వెళ్లిన వారు.. అక్క‌డి ప్ర‌త్య‌క్ష సాక్ష్యుల మాట‌ల్ని.. ప్రాధ‌మికంగా ఉన్న స‌మాచారాన్ని.. సీసీ కెమేరా ఫుటేజ్ ని తీసుకొని ప్ర‌మాదం ఎందుకు జ‌రిగింది? ఎలా జ‌రిగింద‌న్న విష‌యాల్ని విశ్లేషించారు. అన్నింటికి మించి.. మెట్రో ఫిల్ల‌ర్ వైపు కారు ఎందుకు తిరిగి ఉంటుంద‌న్న విష‌యం మీద దృష్టి సారించారు. నిషిత్ ఎక్క‌డ త‌ప్పు చేశాడ‌న్న అంశాన్ని ప‌రిశీలించారు.

పోలీసు.. ర‌వాణా శాఖ ఉన్న‌తాధికారుల అభిప్రాయం ప్ర‌కారం.. ముందుగా వెళుతున్న కారును ఓవ‌ర్ టేక్ చేసే ప్ర‌య‌త్నంలోనే అస‌లు ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మెట్రోఫిల్ల‌ర్ ను వేగంగా తాకిన నిషిత్ కారు.. కేవ‌లం ఐదు సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే చేరుకున్న‌ట్లుగా గుర్తించారు.

నిజానికి నిషిత్ త‌న ఇంటికి వెళ్లేందుకు రోడ్డుకు ఎడ‌మ‌వైపు వెళ్లాల్సి ఉంది. కానీ.. పూర్తిగా కుడివైపున‌కు వాహ‌నాన్ని తిప్ప‌టం చూస్తే.. ముందు వెళుతున్న వాహ‌నాన్ని అధిగ‌మించాల‌న్న ఆలోచ‌న ఉండి ఉండొచ్చ‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. కారు 205 కిలోమీట‌ర్ల వేగంతో మెట్రో ఫిల్ల‌ర్‌ ను ఢీ కొట్ట‌టంతో ఫిల్ల‌ర్ ర‌క్ష‌ణ గోడ స్వ‌ల్పంగా దెబ్బ తిన్న‌ట్లుగా గుర్తించారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పెద్ద‌మ్మ గుడి వ‌ర‌కూ సుమారు రెండు కిలోమీట‌ర్ల దూరంలో రెండు డేంజ‌ర్ స్పాట్లు ఉన్నాయి. ఈ రెండు చోట్ల జెడ్ ఆకారంలో రోడ్డు ఉండ‌టం.. ఫిల్ల‌ర్లు వ‌రుస‌గా కాకుండా.. రైలు వెళ్లేందుకు వీలుగా మెలిక‌లు తిరిగి ఉండ‌టం.. ఒక‌టి ముందుకు.. రెండోది వెనుక నిర్మించ‌టంతో వాహ‌నాలు న‌డిపే వారు.. ముఖ్యంగా రాత్రి వేళ డ్రైవ్ చేసే వారికి ప్ర‌మాదాల బారిన ప‌డ‌టానికి ఎక్కువ అవ‌కాశం ఉండొచ్చ‌న్నారు. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని యాక్సిడెంట్లు ఎక్కువ‌గా జ‌రిగే ప్రాంతంగా ప్ర‌క‌టించి.. ఇక్క‌డ గంట‌కు కేవ‌లం 40 కిలోమీట‌ర్ల వేగంలో మాత్రం వాహ‌నాల్ని న‌డపాల‌న్న హెచ్చ‌రిక చేయాల‌ని నిర్ణ‌యించటం గ‌మ‌నార్హం. అతి వేగం.. ముందు వాహ‌నాన్ని దాటి వెళ్లాల‌న్న ప్ర‌య‌త్నంతో పాటు.. ఎడ‌మ వైపు వెళ్లాల్సిన కారు కుడివైపు వెళ్ల‌టం నిషిత్ ప్రాణాలు పోవ‌టానికి కార‌ణంగా అధికారులు భావిస్తున్నారు.

ఇక‌.. మెట్రో ఫిల్ల‌ర్‌ ను కారు ఎంత వేగంగా ఢీ కొట్టిందంటే.. ఫిల్ల‌ర్ ను ఢీ కొట్టిన కారు ముందు భాగం 30 శాతం ఫిల్ల‌ర్ లోప‌ల‌కు చొచ్చుకుపోవ‌ట‌మే కాదు.. ఫిల్ల‌ర్ ను ఢీ కొని మ‌ళ్లీ రెండు అడుగుల మేర వెన‌క్కి వ‌చ్చేయ‌టాన్ని అధికారులు గుర్తించారు. ఇంత వేగంతో కారు ప్ర‌యాణించిన‌ప్పుడు కారుకు ఉండే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లైన సీటు బెల్ట్.. బెలూన్లు కాపాడ‌లేవ‌న్న అభిప్రాయాన్ని అధికారులు వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/