Begin typing your search above and press return to search.
విపక్షాల్ని ఇరిటేట్ చేసేందుకే మోడీ డుమ్మా?
By: Tupaki Desk | 22 Nov 2016 5:00 PM ISTఅర్థమైనట్లే కనిపించే మోడీలో అర్థం కాని కోణాలు చాలానే కనిపిస్తాయి. ఆయనమాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఆయన్ను అభిమానించేవారికి ఆయనలో తప్పులు కనిపించవు. ఆయన్ను ద్వేషిం చేవారిలో ఆయన చేసేఒప్పులు గుర్తించే ఛాన్సే ఉండదు. మోడీ తప్పొప్పుల్ని సాపేక్షంగా చూసే వారికి మాత్రం ఆయన తీరు కాస్త సిత్రంగా ఉంటుంది. మోడీని రాగద్వేషాలకు..భావోద్వేగాలకు అతీతంగా మదింపు చేసే ప్రయత్నం చేస్తే.. ఆయన మహానుభావుడైన రాజకీయ నేతగా కనిపించరు. కాకుంటే.. మిగిలిన వారి కంటేదేశానికి ఏదో చేయాలన్న తపన బలంగా కనిపిస్తుంది. అదే సమయంలో సగటు రాజకీయనేతల్లో ఉండే చాలానే నెగిటివ్ కోణాలు కనిపిస్తాయి.
తాను.. తన పార్టీ తప్పించి.. తమను దెబ్బ తీసే అవకాశం ఉన్న రాజకీయనేతను.. పార్టీని ఆయన్ను ఉత్తినే వదిలిపెట్టరు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఉదంతాన్ని మర్చిపోకూడదు. తనకు గురువు..గుజరాత్ ముఖ్యమంత్రి కావటానికి కారణమైన అద్వానీని ఆయన ఎంతలా గౌరవిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అలా అని మోడీని మొత్తంగా చెడ్డవాడిగా అభివర్ణించటం కూడా తప్పేఅవుతుంది. ఎంత అయితే ఉండాలో అంత ఇగో మోడీలో పుష్కలం అని చెప్పకతప్పదు. నోట్ల రద్దు అంశంపై లోక్ సభలో వాడీవేడీగా వ్యవహారాలునడుస్తుంటే.. తనకు అంతకు మించిన పని ఉన్నట్లుగా ఆయన సభకు గైర్హాజరుకావటం చూసినప్పుడు మోడీలోని మరో కోణం స్పష్టంగా కనిపిస్తుంది. బహిరంగసభల్లో లక్షలాది మంది ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే మోడీ.. సభను ఉద్దేశించికూడా తన వాదనను వినిపించొచ్చు కదా.
ఆ మాట చెబితే.. సభలో ప్రధాని మాట్లాడే పరిస్థితి ఉందా? అన్న ప్రశ్నను బీజేపీనేతలు సంధిస్తారు. ఒకవేళ అలాంటి వాతావరణం లేనప్పటికీ.. సభకు హాజరుకావటం.. తాను చెప్పాలుకున్నది చెప్పే ప్రయత్నం చేయటం.. సభ్యులు అడిగేప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం లాంటివి చేయాలి. కానీ.. అలాంటివేమీచేయకుండా.. సభకు హాజరు కాకుండా ఉండటం ఏ మాత్రం సబబు కాదన్నభావన పలువురు వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల్ని ఇరిటేట్ చేసేలా.. వారిని తాను పెద్దగా పరిగణలోకి తీసుకోవటం లేదన్న సంకేతాలు ఇచ్చేలా ప్రధానివ్యవహరిస్తున్నారన్నది పలువురి విశ్లేషకుల మాట. మోడీ ఎంత గొప్పవాడైనా..బలవంతుడైన అధినేత అయినప్పటికీ.. ఆయన పార్లమెంటుకు జవాబుదారీఅన్న విషయాన్ని మర్చిపోకూడదు. యావత్ దేశాన్ని కదిలించి వేస్తున్నఒకఘటనకు సంబంధించి సభ అట్టుడిగి పోతున్నా.. అదేం పట్టనట్లుగా మోడీఉండిపోవటం సబబు కాదు. తెలిసి చేసే వారిని ఎవరు మాత్రం మార్చగలరు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/