Begin typing your search above and press return to search.
లోగుట్టు: ఇన్ని లోపాలు.. మోడీకేంటి ధీమా?
By: Tupaki Desk | 29 April 2019 10:10 AM ISTవ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. నిజానిజాయితీగా పనిచేయడం మానేశాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నాయి. సర్లే అది రాజకీయ వైరం అని సరిపెట్టుకుంటాం.. ఇక జనాలను మోడీసార్ వదల్లేదు. నోట్ల రద్దు పేరిట అందరినీ బ్యాంకుల ముందు క్యూలు కట్టించారు. జీఎస్టీ పేరిట ఆర్థిక వ్యవస్థను అతాలకుతలం చేశారు. ఈ రెండింటి సంస్కరణల వల్ల చిన్నా చితక పరిశ్రమలు, పెద్ద ఎత్తున ఉపాధి పోయిందని ఎన్నో సర్వేలు తేల్చాయి. జనాలను రోడ్డున పడేసి.. ఉద్యోగాలు ఓడగొట్టేసి.. ఆయన ఇంకా మేకపోతు గాంభీర్యం.. మోడీ ఏం చేశారని ఈ ఎన్నికల్లో అంత దూకుడుగా వెళుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచనలో పడుతున్నారు..
తాజాగా మోడీ సారు సగటు మధ్యతరగతిపై పెద్ద బాంబే వేశారు. అది ఎన్నికలు మొదలయ్యాకే కావడం గమనార్హం. మొన్న మార్చి-ఏప్రిల్ కాలంలోనే దేశవ్యాప్తంగా కేబుల్ టీవీ వ్యవస్థ కుదేలయ్యింది. ఎవరు దేనికి డబ్బులు కడితే అదే చానెల్ చూసే వెసులుబాటును మోడీ కల్పించారు. అంతకుముందు రెండు వందలు కడితే 1000 చానెల్స్ వచ్చేవి. పెద్దలు న్యూస్, మహిళలు సీరియల్స్, పిల్లలు కార్టూన్ చానెల్స్, యూత్ క్రికెట్.. బోర్ కొడితే నేషనల్ జియోగ్రఫీ లాంటి విజ్ఞాన చానెల్స్ ఇలా.. మన చేతిలో రిమోట్ ఉంటే చాలు ప్రపంచం మన దాసోహమయ్యేది. ఇలా జనాలకు ఎంతో కనెక్ట్ అయిన కేబుల్ టీవీ వ్యవస్థపై పడి దాన్ని దూరం చేశారు మోడీ. ఇప్పుడు 300 నుంచి 500 పెడితే కానీ ఆ చానెల్స్ మనకూ రావడం లేదు. అంత డబ్బు పెట్టి కొనడం ఇష్టం లేక ఇష్టమైన వాటికి కూడా జనాలు దూరమవుతున్నారు..
అయితే దీనివెనుక పెద్ద కార్పొరేట్ లాబీయింగ్ ఉందని కథకథలుగా చెబుతారు. త్వరలోనే మోడీకి దగ్గరైన పారిశ్రామిక దేశవ్యాప్తంగా పెద్దఎత్తున డిష్ టీవీతోపాటు, వైర్ డ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించబోతున్నాడట.. జనాల అందరూ ఆయన ప్రారంభించే కేబుల్, కం ఇంటర్నెట్ సేవలకు మళ్లాలనే మోడీ ఇలా కేబుల్ టీవీ చట్టం పేరుతో జనాలకు చానెల్స్ కట్ చేశారని ఢిల్లీ గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు ఎంతో దగ్గరైన పారిశ్రామికవేత్తకు మేలు చేసేలానే మోడీ ఇలా కేబుల్ టీవీ వ్యవస్థను నీరుగార్చాడన్నది ఇన్ సైడ్ టాక్.
వాళ్ల రాజకీయ ప్రయోజనాలు, తెరవెనుక లాలూచీ వ్యవహారాలు ఎన్ని నడిచినా.. తన అధికార, బీజేపీని తాకట్టు పెట్టి మరీ మోడీ ఇంత సాహసానికి ఎందుకు పాల్పడుతున్నారు.. జనాలు కూడా ఇంకా మోడీ మాటలను ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు? ఈ ఎన్నికల్లో మోడీకి కర్రుకాచి వాత పెడుతారా? మోడీ శిబిరం ఇంత దారునంగా వ్యవహరిస్తున్నా.. ఎందుకంత ధీమాగా ఉంది.? ఇలా వీటన్నింటిని సమాధానం మే 23న ఓట్ల లెక్కింపు రోజే వస్తుంది. అప్పటివరకూ ఎదురుచూడడం తప్పితే మనం మనం చేసేదేమీ లేదు.