Begin typing your search above and press return to search.

అఖిలేశే ‘నేతాజీ’

By:  Tupaki Desk   |   1 Jan 2017 12:45 PM IST
అఖిలేశే ‘నేతాజీ’
X
సమాజ్ వాది పార్టీలో నేతాజీ అంటే ములాయం సింగ్ యాదవ్. పార్టీ అధినేత అయిన ఆయన్ను అంతా నేతాజీ అని పిలుస్తారు. కానీ... నేతాజీకి పార్టీపై పట్టు పూర్తిగా పోయిందట. కొడుకు అఖిలేశ్ తో విభేదించిన ఆయన వైపు నేతలెవరూ వెళ్లడం లేదట. ఎవరో కొద్ది మంది మాత్రమే ములాయం పట్ల విశ్వాసంగా ఉన్నారని.. మిగతావారంతా అఖిలేశ్ వెంటేనని చెబుతన్నారు. నిన్న అఖిలేశ్ ను బహిష్కరించి మళ్లీ ఆ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడానికి కూడా కారణం ఇదేనని తెలుస్తోంది. అఖిలేశ్ పై వేటు వేసినా ఎమ్మెల్యేలంతా ఆయన వెంటే వెళ్లడంతో ములాయం షాక్ తిన్నారని చెబుతున్నారు.

అఖిలేష్ యాదవ్ చూపిన బలం ముందు ములాయం సింగ్ యాదవ్ నిలవలేకపోతున్నారట. నాటకీయ పరిణామాల మధ్య కేవలం 24 గంటల వ్యవధిలోనే కుమారుడి సస్పెన్షన్ పై ములాయం యూ టర్న్ తీసుకోవడానికిగల కారణాలు, ఎందుకు ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్న అంశంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. మొత్తం 229 మంది సమాజ్ వాదీ ఎమ్మెల్యేలు ఉండగా - అందులో 200 మందికి పైగా ఎమ్మెల్యేలు అఖిలేష్ కు మద్దతుగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో ఆయనపై సస్పెన్షన్ కొనసాగితే, పార్టీని చీల్చి, తమదే అసలైన సమాజ్ వాదీ పార్టీ అని చెబుతూ, ప్రభుత్వాన్ని కొనసాగించే దిశగా అఖిలేష్ అడుగులు వేయడం ఖాయంగా కనిపించింది. పలువురు సీనియర్ నేతలు సైతం అఖిలేష్ వెంటే నిలిచారట.

ప్రజలు, ముఖ్యంగా యువత కుమారుడి వెనకే ఉన్నారన్నది అర్థం కావడంతో ములాయం వెనక్కు తగ్గారు. ఇదంతా అర్థం చేసుకున్న రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ కూడా ములాయంను హెచ్చరించారట. మొత్తానికి సమాజ్ వాది పార్టీకి అఖిలేశ్ కొత్త నేతాజీగా మారినట్లు కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/