Begin typing your search above and press return to search.

అయ్యా వివేకా.. మారటం ఇక్కడితో ఆపుతారా?

By:  Tupaki Desk   |   10 Aug 2019 5:10 AM GMT
అయ్యా వివేకా.. మారటం ఇక్కడితో ఆపుతారా?
X
పిల్లి తన పిల్లల్ని అదే పనిగా మారుస్తుందంటారు. పిల్లితో పోటీ పడేలా తెలంగాణ నేత కమ్ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ పార్టీలు మారుతున్నారు. ఒకటి తర్వాత ఒకటిగా మారటం.. మారిన పార్టీ నుంచి మళ్లీ పాత పార్టీకి వెళ్లటం.. ఆ వెంటనే మరో పార్టీలో చేరటం చేస్తూ తన ఇమేజ్ ను అదే పనిగా డ్యామేజ్ చేసుకుంటున్నారు. ప్రజల్లో పలుకుబడితో పాటు.. హంగు.. ఆర్భాటాలకు ఏ మాత్రం కొదవ లేని వివేక్ లాంటి వారు ఇంత తరచూ పార్టీలు మారటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి కుమారుడైన వివేక్ కాంగ్రెస్ లో ఉండేవారు. తర్వాత టీఆర్ ఎస్ లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేశారు. అంతనే మళ్లీ టీఆర్ ఎస్ లో మారారు. ఆ మధ్యనే కాంగ్రెస్ లోకి మారటం ద్వారా.. వివేక్ ఎప్పుడే పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితికి తీసుకొచ్చారు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఆయన పార్టీ మారినంతనే.. అవకాశాలు చేజారిపోవటం కనిపిస్తుంది. ప్రజల్లో పేరు.. పలుకుబడి ఉన్న నేత ఇంత అస్థిరంగా అదే పనిగా పార్టీ మారటం ఇటీవల కాలంలో వివేక్ అన్న మాట వినిపిస్తోంది.

గడిచిన కొంతకాలంగా బీజేపీలోకి వెళ్లేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేసిన ఆయన.. ఎట్టకేలకు కమలం గూటికి చేరారు. ఇటీవల కాలంలో తెలంగాణలో బీజేపీ బలోపేతం కావటం.. రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్న క్రమంలో బీజేపీలోకి చేరటం మంచిదన్న సన్నిహితుల సలహాల్ని పరిగణలోకి తీసుకున్న వివేక్.. ఎట్టకేలకు పార్టీలో చేరారు.

తాను పార్టీలో చేరినందుకుగాను.. రాజ్యసభ సీటు ఇవ్వాలన్న డిమాండ్ వినిపించిన వివేక్.. తాజాగా అలాంటి హామీ బీజేపీ అధినాయకత్వం నుంచి రాకున్నా బీజేపీలో చేరిపోవటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా బీజేపీలో స్థిరంగా ఉంటారా? మళ్లీ పార్టీ మారే పనిలో పడతారా? అన్న ప్రశ్న పలువురిలో వ్యక్తం కావటం చూస్తే.. ఆయన ఇమేజ్ ఎంతలా డ్యామేజ్ అయ్యిందో చెప్పక తప్పదు.