Begin typing your search above and press return to search.
కేసీఆర్ తో భేటీకి మోడీ నై అంది అందుకేనా?
By: Tupaki Desk | 29 Oct 2015 9:55 AM ISTప్రధాని మోడీతో సయోధ్య కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కిందామీదా పడుతున్న సంగతి తెలిసిందే. మందితో కలిసే అవకాశం దక్కుతున్నప్పటికీ.. ప్రధానితో ఏకాంత చర్చలకు మాత్రం సానుకూల స్పందన రాకపోవటం తెలిసిందే. తెలంగాణకు కేంద్రం దన్ను అత్యవసరమైన నేపథ్యంలో ప్రధాని కరుణ తమకు అవసరమన్న భావనను కలుగజేసేందుకు సైతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెనుకాడటం లేదని చెబుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట కేసీఆర్ కనిపించటానికి వెనుక చాలానే జరిగిందని చెబుతారు. ప్రధాని వెంట ఉండేందుకు ముందస్తుగా అనుమతి కోరటం.. అందుకు చంద్రబాబు ఓకే చెప్పటంతో ప్రధాని వెంట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడవటం సాధ్యమైందన్న మాట వినిపిస్తోంది.
అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోడీకి దగ్గరగా ఉంటూ.. ఆయనపట్ల తనకున్న విధేయతను వీలైనన్నిసార్లు ప్రదర్శించే ప్రయత్నం కేసీఆర్ చేసినప్పటికి మోడీ సానుకూలత వ్యక్తం చేయక పోవటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మోడీ మరీ ఇంత మొండివాడా? అన్న ప్రశ్న కూడా తలెత్తే పరిస్థితి. కోరి మరీ స్నేహహస్తం చాస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో మోడీ ఎందుకింత కటువుగా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. మోడీని కలిసి.. ప్రైవేటుగా చర్చలు జరిపేందుకు దాదాపు ఇప్పటికే పదుల సార్లు కేసీఆర్ ప్రయత్నం చేశారట.
తాజాగా ప్రధాని మోడీతో మీటింగ్ ఖాయమని కేసీఆర్ భావించారని.. అయితే.. అనూహ్యంగా మోడీ నో చెప్పటం కేసీఆర్ శిబిరానికి సైతం విస్మయాన్ని కలిగించిందని తెలుస్తోంది.మోడీతో భేటీ కుదరదని తేలిన సందర్భాల్లో తన ఢిల్లీ పర్యటనను సైతం రద్దు చేసుకున్న కేసీఆర్.. ఈసారి కచ్ఛితంగా మోడీతో భేటీ ఖాయమని భావించి వెళ్లారు.
అయితే.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇంతకీ కేసీఆర్ తో భేటీకి మోడీ నై చెప్పటానికి కారణం ఏమిటన్న అంశంపై సరికొత్త వాదన వినిపిస్తోంది. ఇటీవల కేసీఆర్ పై సీబీఐ ప్రశ్నలు సంధించి వెళ్లటం.. ఈఎస్ ఐ భవన నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలతో పాటు.. సహారా గ్రూప్ తో కేసీఆర్ కు ఉన్న సంబంధాలపై కూడా సీబీఐ ఆరా తీయటమే కారణమని చెబుతున్నారు.
గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన సమయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ దృష్టి సారిస్తోంది. ఈఎస్ ఐ భవన నిర్మాణాన్ని మత్య్స శాఖతో చేయించటంపై ఇప్పటికే పలు ప్రశ్నల్ని సీబీఐ సంధించిన సంగతి తెలిసిందే. తాజాగా సహారా గ్రూపు కు సంబంధించి పీఎఫ్ మినహాయింపు ఇస్తూ.. నాటి కార్మిక మంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సీబీఐ దృష్టి సారించింది. దీనికి సంబంధించిన సమాచారం ముందస్తుగా ఉండటం.. ఇలాంటి ఆరోపణలు వస్తున్న సమయంలో కేసీఆర్ తో భేటీ కావటం సరికాదన్న ముందుస్తు జాగ్రత్తతోనే మోడీ నో చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఇవి తాజా కారణాలైతే గతంలో మోడీ పట్ల-కేంద్రపైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, దుర్భాషలు కూడా కారణమని తెలుస్తోంది. దేశంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని తనకు తెలిసేలా మోడీ పెట్టుకున్న ప్రైవేటు టీం ఎప్పటికపుడు గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఎవరు ఏం మాట్లాడిన మోడీకి సమాచారం చేరవేస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రైవేట్ టీం... వివిధ భాషల సినిమాల్లో కంటెంట్ ను కూడా క్రోడీకరించి మోడీ లైబ్రరీని తయారుచేస్తోంది.