Begin typing your search above and press return to search.
మోడీతో అమెరికన్లు సెల్ఫీలు దిగంది ఎందుకంటే?
By: Tupaki Desk | 9 Jun 2016 10:02 PM ISTఇప్పటివరకూ దేశ ప్రధానులుగా వ్యవహరించిన నేతలకు శైలికి భిన్నంగా ప్రధాని మోడీ వ్యవహారశైలి ఉంటుందన్న విషయం తెలిసిందే. టెక్నాలజీ సేవీ అయిన మోడీకి సెల్పీలు దిగటం.. ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పెట్టటంలో మా జోరుగా వ్యవహరిస్తారు. ఎక్కడికైనా వెళితే.. తనదైన శైలిలో సెల్ఫీలు దిగుతుంటారు. అలాంటి మోడీ.. తాజాగా ఐదుదేశాల పర్యటనకు వెళ్లిన ఆయన అమెరికాలో ఒక్కటంటే.. ఒక్క సెల్ఫీలు దిగని వైనాన్ని గమనించారా?
ఆయనే కాదు.. ఆయనతో మరే అమెరికన్లు కూడా సెల్ఫీలు దిగలేదు? మోడీ ఆటోగ్రాఫ్ ల కోసం అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఉత్సాహం ప్రదర్శించి.. చుట్టూ మూగినప్పుడు సెల్ఫీల కోసం ఎందుకు ఆసక్తి ప్రదర్శించలేదు? అన్న ప్రశ్నను వేసుకుంటే ఆసక్తికర సమాధానమే వస్తుంది. ఇంతకీ మోడీతో సెల్పీలు దిగకపోవటానికి కారణం.. వైట్ హౌస్ ప్రోటోకాల్ ఎక్స్ పర్ట్ ఎలిజబెత్ హెంగ్ జారీ చేసిన విస్పష్ట ఆదేశాలేనంట.
భారత ప్రధాని మోడీని కలిసే చట్టసభ సభ్యులు.. వారి సిబ్బంది ఎవరూ కూడా ఆయనతో సెల్ఫీలు దిగకూడదంటూ ఆర్డరేశారంట. విదేశీ నేతలు అమెరికాలో పర్యటించే సమయంలో వారితో సెల్ఫీలు తీసుకోవటం మంచిది కాదని చెప్పటమే కాదు.. మీ బాస్ లు సెల్ఫీలు దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎవరికి వారు సెల్ఫీలు తీసుకోకుండా పోస్ట్ పోన్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. సెల్ఫీలు లేకుండా మోడీ అమెరికా టూర్ ముగియటం కాస్త లోటు కలిగించే అంశంగానే చెప్పాలి.