Begin typing your search above and press return to search.

అమిత్ షాకు హోమ్ మంత్రి.. సీక్రెట్ అదే..

By:  Tupaki Desk   |   2 Jun 2019 1:34 PM GMT
అమిత్ షాకు హోమ్ మంత్రి.. సీక్రెట్ అదే..
X
బీజేపీ ఆపరేషన్ 2019 ముగిసింది. మోడీషాల ద్వయం దిగ్విజయంగా దేశంలో అధికారంలోకి వచ్చింది. 2014 కంటే సీట్లు పెరిగి పూర్తి స్థాయి మెజారిటీతో బీజేపీ కేంద్రంలో కూర్చుంది. అయితే ఈ విజయంలో మోడీషాలదే క్రెడిట్. అందుకే రెండోసారి గెలవగానే తన అనుయాయుడు అమిత్ షాను హోంమంత్రిని చేసేశాడు మోడీ. ఇప్పటివరకు 2019లో హోంమంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ ను రక్షణ మంత్రిని చేశారు. అయితే చాలామందికి నంబర్ 2 పొజిషన్ ను మోడీ..తన అనుంగ అనుచరుడైన షాకు ఇచ్చాడని భావించారు. కానీ దీనివెనుక పెద్ద వ్యూహమే ఉందన్న సంగతి తాజాగా బయటపడింది..

అమిత్ షాకు హోమంత్రి పదవి మోడీ ఇవ్వడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందన్న వాదన ఢిల్లీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దేశంలో జాతీయవాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2024లో కూడా అధికారంలోకి వచ్చేందుకు వీలుగా షాను రంగంలోకి దింపినట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హోంమంత్రి చేతిలోనే శాంతి భద్రతలు పోలీస్ వ్యవస్థ ఉంటుంది. కీలక ప్రతిపాదనలు - చట్టాలు చేయడం - ఈడీ - ఐటీ లాంటి వ్యవస్థలు హోంమంత్రిత్వశాఖనే చూస్తుంది. దేశంలోని కీలక విభాగాలను పర్యవేక్షిస్తుంది.. అందుకే సాఫ్ట్ అయిన రాజ్ నాథ్ ను రక్షణ మంత్రిగా పంపించి షాకు మోడీ హోంమంత్రి పదవి ఇచ్చాడని సమాచారం.

హోంమంత్రిగా అమిత్ షా నియామకంతో ప్రాంతీయ పార్టీలను కబలించడం.. పోలీస్ వ్యవస్థతో దెబ్బతీయడం.. ఈడీ - ఐటీ విభాగాలతో ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల మూలాలను దెబ్బతీయడమే అజెండా బీజేపీ షాకు హోంమంత్రి పట్టం కట్టబెట్టినట్టు సమాచారం. దీన్ని బట్టి తోకజాడించే పార్టీలను షా అరికడుతారు. ఇక ప్రాంతీయంగా బలపడడడం.. దక్షిణాదిన పాగావేసేందుకు అక్కడ అధికారంలో ఉన్న వారిని కేసులతో లొంగదీసుకోవడం చేసేందుకే షాకు హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా కీలకమైన పోలీస్ - ఐటీ - ఈడీ శాఖలు తన చేతిలో పెట్టుకొని పార్టీలను బయటపెట్టడం.. 2024 కల్లా బీజేపీని విస్తరించడమే అమిత్ షా కర్తవ్యంగా కనిపిస్తోంది.