Begin typing your search above and press return to search.

కేటీఆర్ పొగ‌డ్త వెనుక గేమ్ ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   15 Dec 2017 9:00 PM IST
కేటీఆర్ పొగ‌డ్త వెనుక గేమ్ ప్లాన్ ఇదేనా?
X
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేటీఆర్‌.. ఆ ప‌ద‌విని చేప‌ట్టి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఐటీ మంత్రి హోదాలో ఇప్ప‌టికి ఆయ‌న చాలానే వేదిక‌ల్ని పంచుకున్నారు. మ‌రి..ఎప్పుడూ.. ఏ వేదిక మీదా గుర్తుకు రాని బాబు గొప్ప‌త‌నం తాజా వేదిక మీద మాత్రం ఎందుకు గుర్తుకు వ‌చ్చింది? హైద‌రాబాద్‌కు మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకొచ్చిన క్రెడిట్ బాబు ఖాతాలో వేసేందుకు మంత్రి కేటీఆర్ ఎందుకు రెఢీ అయ్యారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల పేరుతో.. తెలంగాణ మ‌హాస‌భ‌ల్ని నిర్వ‌హిస్తున్న వేళ‌.. తీవ్ర ఆగ్ర‌హంతోనూ.. ఆవేద‌న‌తోనూ ఉన్న సీమాంధ్రుల్ని సంతృప్తిప‌ర్చ‌టానికి మంత్రి కేటీఆర్ నోట ఇలాంటి మాట వ‌చ్చిందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదేనా?.. ఇంకేదైనా వ్యూహం ఉందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న అయ్యింది.

హైద‌రాబాద్‌లో భాగ‌మైన రెండు ప్ర‌దేశాలకు వెళ్లిన‌ప్పుడు.. అక్క‌డ తిరుగుతున్న‌ప్పుడు తాము ఉన్న‌ది హైద‌రాబాద్ లోనేనా? అన్న భావ‌న క‌లిగే అవ‌కాశం ఉంది. అలాంటి భావ‌న కలిగే వాటిలో మొద‌టిది పాత‌బ‌స్తీ అయితే రెండోది సైబ‌రాబాద్‌. పాత‌బ‌స్తీ వీధుల్లో తిరుగుతున్న‌ప్పుడు హైద‌రాబాద్ లో ఉన్నామ‌న్న భావ‌న అస్స‌లు క‌ల‌గ‌దు. ఆ మాట‌కు వ‌స్తే.. వేరే రాష్ట్రంలో ఉన్న‌ట్లుగా ఉంటుంది. అభివృద్ధి అన్న‌ది ఏమాత్రం కనిపించ‌కుండా ఉండ‌ట‌మే కాదు.. షాపుల మీద బోర్డుల నుంచి.. అక్క‌డి వ్య‌వ‌హారం అంతా స‌గ‌టు హైద‌రాబాద్ స్టైల్‌కు భిన్నంగా క‌నిపిస్తుంటుంది.

దీనికి పూర్తి భిన్న‌మైన అనుభూతి సైబ‌రాబాద్ లో తిరిగితే క‌లుగుతుంది. మ‌రీ.. ముఖ్యంగా ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టు.. వేవ్ రాక్ నుంచి వ‌చ్చేట‌ప్పుడు చూస్తే.. హైద‌రాబాద్ లో ఉన్నామా? విదేశాల్లో ఉన్నామ‌న్న భావ‌న క‌ల‌గ‌టం కాయం. భారీ భ‌వంతుల‌తో.. హైద‌రాబాద్ మీద స‌రికొత్త పీలింగ్ క‌లిగేలా చేస్తాయి. ఇదంతా త‌న క్రెడిటే అని చంద్ర‌బాబు చెప్పుకుంటూ ఉంటారు. ఇది అందరూ విన్న‌దే. అయితే.. మంత్రి కేటీఆర్ లాంటి వారి నోటి నుంచి ఆ మాట రావ‌టం అంత చిన్న విష‌యం కాదు. ఇంత‌కీ బాబును కేటీఆర్ ఎందుకంతగా పొగిడిన‌ట్లు? అన్న ప్ర‌శ్న వేసుకుంటే చాలానే కార‌ణాలు క‌నిపిస్తాయి. రాజ‌కీయ.. మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తున్న వాద‌న‌ల్ని ఒక చోట‌కు చేరిస్తే..

1. బాబును పొగిడేయ‌టం ద్వారా వెల్‌కం వ్యూహాన్ని కేటీఆర్ మ‌రింత ముందుకు తీసుకెళ్లారు. వెల్‌కం లోని క‌మ్మ‌లు కేటీఆర్ మాట‌ల‌కు ఫిదా కావ‌ట‌మే కాదు.. టీఆర్ఎస్‌కు క‌ట్టుబానిస‌లుగా మారేలా కేటీఆర్ మాట‌లు ఉన్నాయి. టీడీపీకి క‌మ్మ‌లు ఎంత విశ్వ‌స‌నీయ ఓటుబ్యాంకో.. కేటీఆర్ మాట‌ల‌తో టీఆర్ఎస్ కు క‌మ్మ‌లు అంత విశ్వ‌స‌నీయ‌మైన ఓటుబ్యాంకుగా ట‌ర్న్ చేసేందుకే కేటీఆర్ అలా మాట్లాడి ఉంటారు.

2. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో ఏపీ ప్రాంతాల వారికి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న తెలంగాణ ఉద్య‌మ నినాదాన్ని తుంగ‌లోకి తొక్కేలా టీఆర్ఎస్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న భావ‌న‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు మారిన వేళ‌.. ఆ మంట‌ను త‌గ్గించేందుకే మంత్రి కేటీఆర్ నోటి నుంచి పొగ‌డ్త‌లు వ‌చ్చాయి.

3. మంత్రి కేటీఆర్ ఈ మ‌ధ్య‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూసిన‌ప్పుడు త‌న‌ను తాను ఫ్యూచ‌ర్ లీడ‌ర్ గా ప్రొజెక్ట్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అంద‌రికి ఆమోద‌యోగ్య‌మైన నేత‌గా మారే క్ర‌మంలోనే బాబును పొగిడేశారు.

4. చంద్ర‌బాబు పాల‌నా సామ‌ర్థ్యాన్ని.. ఆయ‌న ప్ర‌భుత్వ ప‌నితీరును పొగిడేసేలా మాట్లాడిన మంత్రి కేటీఆర్ మాట‌ల్ని పొలిటిక‌ల్ యాంగిల్ లో కాకుండా మ‌రో కోణంలో చూడాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే.. చంద్ర‌బాబును ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఐటీ వేదిక మీద‌. ఐటీ రంగంలోని ప‌లువురు బాబు ప‌ట్ల పాజిటివ్ గా ఉండ‌టం క‌నిపిస్తుంది. ఇలాంటి వ‌ర్గాల్ని త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నంలోనే తాజా వ్యాఖ్య‌లు.

5. ఏడాదిన్న‌ర కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. తెలంగాణ అధికార‌పక్షానికి దూరంగా ఉండే సీమాంధ్రుల మ‌న‌సుల్ని దోచుకునేలా.. వారికి తాము త‌ప్ప మ‌రెవ‌రూ క‌నిపించ‌కుండా ఉండేలా చేయ‌టం కోసం.. సీమాంధ్రుల్ని తాము ప‌ట్టించుకుంటున్నామ‌న్న భావ‌న క‌లిగేలా చేయ‌టం కోసం కూడా కేటీఆర్ పొగడ్త ఉండి ఉంటుంది. ఒక్క‌రోజులోనో.. ఒక్క మాట‌లోనో త‌మ మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను టీఆర్ ఎస్ త‌గ్గించుకోలేదు. అందుకే.. అవ‌కాశం వ‌చ్చిన వేళ‌లో చేసే పొగ‌డ్త‌ల‌తో ఒకింత పాజిటివ్ నెస్ పెంచే ప్ర‌య‌త్నంలో భాగ‌మే తాజా పొగ‌డ్త‌.