Begin typing your search above and press return to search.
కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టటం వెనుక అంత జరిగిందా?
By: Tupaki Desk | 29 Nov 2019 1:13 PM ISTఆర్టీసీ అంశంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయటం.. అవసరమైతే రెండు రోజుల పాటు చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కేసీఆర్.. అందుకు భిన్నంగా ప్రెస్ మీట్ పెట్టేశారు. ఎందుకిలా జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీలో కదిలిన పావులతోనే కేసీఆర్ తన బెట్టును సడలించుకోవాల్సి వచ్చిందంటున్నారు.
సమ్మెను విరమిస్తున్నట్లుగా ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే ప్రకటించినప్పటికీ సర్కారు నుంచి సానుకూల స్పందన లేని విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్ పలువురు మంత్రుల్ని కలిసిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేసీఆర్ కు ఫోన్ చేయటం.. దాదాపు 45 నిమిషాలు వెయిట్ చేసినప్పటకీ సీఎం అందుబాటులోకి రాకపోవటం తెలిసిందే.
దీనిపై కేంద్రమంత్రి ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లుగా ప్రైవేటీకరణ అంత తేలిక కాదని.. కేంద్రం ఆమోదం లేకుండా జరగదన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం అనుసరిస్తున్న వైఖరిపై కేంద్రం సానుకూలంగా లేదన్న మాట వినిపిస్తోంది. కేటీఆర్ ఢిల్లీ టూర్ సందర్భంగా ఆర్టీసీ సమ్మె అంశం తరచూ చర్చకు రావటం.. ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే క్లోజ్ చేయాలన్న ఆదేశంతోనే కేసీఆర్ కదలకు తప్పలేదంటున్నారు. ఈ ఒత్తిడితోనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని.. ఆ కారణంతోనే కేంద్రం మీద ఘాటు వ్యాఖ్యలు చేయటం వెనుక అసలు కారణంగా ఇదేనంటున్నారు. ఇందులో నిజం ఎంతన్నది బయటకు రాకున్నా.. కేంద్రం కారణంగానే కేసీఆర్ తన పట్టును కాస్త సడలించినట్లుగా తెలుస్తోంది.