Begin typing your search above and press return to search.

ఆనంపై జగన్ ఎందుకు చర్య తీసుకోలేదంటే.!

By:  Tupaki Desk   |   10 Dec 2019 11:00 PM IST
ఆనంపై జగన్ ఎందుకు చర్య తీసుకోలేదంటే.!
X
వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల జగన్ సర్కారుపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యం నడుస్తోందని సొంత పార్టీ నేతల తీరును ఆనం ఎండగట్టారు. ఆనం అసంతృప్తి వెనుక చాలా కారణాలున్నాయన్న వాదన వినిపించింది.

ఆనం తిరగబడడంతో జగన్ సీరియస్ కావడం.. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించడం జరిగిపోయింది. అయితే తాజాగా అసెంబ్లీలో ఆనం ప్రతిపక్ష చంద్రబాబుపై సెటైర్లు వేయడం.. జగన్ నవ్వుకోవడం.. అభినందించడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

మరి ఆనంలో ఆ అసంతృప్తిని వైసీపీ అధిష్టానం ఎలా చల్లార్చింది.? జగన్ ఎందుకు లైట్ తీసుకున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.

ఆనం కుటుంబం ఆధీనంలో ఉన్న వెంకటగిరి కాలేజీని అధికారుల పర్యవేక్షణలోకి చేర్చారట నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్. అదే కాదు.. ఆనం ఫ్యామిలీ చేపట్టిన ఆల్తూరు ప్రాజెక్టు కాంట్రాక్టు పనులను మంత్రి అనిల్ రద్దు చేశారట.. 260 కోట్ల విలువైన పనులు రద్దు చేయడం ఆనంలో ఆగ్రహానికి కారణమైందట.. ఇక వెంకటగిరి వేణుగోపాల స్వామి ఆలయానికి ట్రస్టీగా ఆనంను తీసేసి పాలకవర్గాన్ని నియమించడానికి వైసీపీ సర్కారు రెడీ అయ్యిందట..

ఇలా మంత్రి పదవి ఇవ్వకున్నా సైలెంట్ గా ఉంటున్న తనపై జిల్లా మంత్రి అనిల్ కుమార్ కక్ష సాధింపులకు పాల్పడడంపై ఆనం రగిలిపోయారు. బయటపడి విమర్శలు చేశారు. ఈ విషయంలో పోస్టుమార్టం జరిపిన జగన్ అండ్ కో ఆనం ఆవేదనలో అర్థముందని ఆయనను కూల్ చేసి చర్యలను వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది.అందుకే జగన్ సహా వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఆనం విషయంలో సాఫ్ట్ కార్నర్ చూపుతున్నారట.. టీ కప్పులో తుఫాన్ లా ఆనం వివాదం ఇప్పుడు వైసీపీలో సమిసిపోయిందిలా..