Begin typing your search above and press return to search.

'ఇంటర్' తప్పులకు కారణమిదే..

By:  Tupaki Desk   |   28 April 2019 10:53 AM GMT
ఇంటర్ తప్పులకు కారణమిదే..
X
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అవకతవకలు తెలంగాణలో ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా కమిటీ చైర్మన్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు - ఐఐటీ ఫ్రొఫెసర్ నిశాంత్ డొంగరి - బిట్స్ ప్రొఫెసర్ వాసన్ బృందం దాదాపు 5 రోజుల పాటు సుదీర్ఘ పరిశీలన జరిపి 10 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇంటర్ ఫలితాల్లో అక్రమాలకు బాధ్యులెవరు?ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో రూపొందించారు. దాదాపు 5 సూచనలు చేసినట్టు సమాచారం.

+ కమిటీ నివేదికలో రూపొందించిన ముఖ్యాంశాలివీ..

*విద్యార్థుల దరఖాస్తుల నుంచి పరీక్షల నిర్వహణ - జంబ్లింగ్ - హాల్ టికెట్స్ - పోస్ట్ ఎగ్జిమినేషన్స్ అన్నీంటిలోనూ కాంట్రాక్ట్ సంస్థ సకాలంలో పూర్తి చేయలేదు. చాలో లోపాలున్నాయని తేల్చారు.

*ఇక ఇంత పెద్ద ఎత్తున నిర్లక్ష్యం ఉన్నా కాంట్రాక్ట్ సంస్థతో పాటు ఇంటర్మీడియెట్ బోర్డుదీ బాధ్యత ఉందని తేల్చారు.

*ఇంటర్ బోర్డ్ నిర్ధేశించిన బాధ్యతలను కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం చేసింది. ముందుగా మాక్ టెస్ట్ నిర్వహించలేదు. ఓకే అనకుండానే ఫలితాలు రిలీజ్ చేసి తప్పులు కంటిన్యూ చేశారు.విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్ అధికారులు ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న పొరపాట్లు - తప్పిదాలను నివేదికను గ్లోబరీనాకు అందించారు. బోర్డు సూచనలను గ్లోబరీనా విస్మరించింది. వీటిని పరిష్కరించకుండానే మళ్లీ ప్రతిపాదనలు పంపగా బోర్డు ఆమోదించలేదు.

*ఇంటర్ బోర్డు నిర్ధేశించిన బాధ్యతలను నిర్వహించడంలో గ్లోబరీనా పూర్తిగా విఫలమైంది.

+ కాంట్రాక్ట్ సంస్థ తప్పులివీ..

*దాదాపు 531 మంది జాగ్రఫీ విద్యార్థుల ప్రాక్టికల్ మార్కులు వారి మెమోల్లో కనిపించలేదు. 496మంది విద్యార్థుల మెమోల్లో మార్కులకు బదులు ఆప్ సెంట్ అని ఇచ్చారు.

*ఇక 4288 మంది ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్ట్ లో సింగిల్ డిజిట్ మార్కులు వేశారు. సాంకేతిక సమస్యల వల్లే ఇలాంటి తప్పులు జరిగాయి.

*విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన మాడ్యూల్ ను గ్లోబరీనా సంస్థ అభివృద్ధి చేయలేదు.

*విద్యార్థుల ప్రాజెక్ట్ విషయంలో గ్లోబరీనా సంస్థ అన్ని అంశాల్లోనూ దారుణంగా వెనుకబడింది.

*ఫలితాల విడుదలకు ముందు మరో సంస్థతో ప్రాసెస్ చేయకుండానే విడుదల చేయడం అతిపెద్ద తప్పు

*రెండు రికార్డులు సరిచూసి మాత్రమే ఫలితాలు విడుదల చేయాలి. దాన్ని గ్లోబరీనా విస్మరించింది.

+ తక్షణ సూచనలివీ..

*మొదటి సంవత్సరం 80శాతం మార్కులు సాధించిన విద్యార్థి రెండో సంవత్సరంలో ఫెయిల్ అయితే బోర్డు ఖచ్చితంగా అతడి పేపర్ ను రీవెరిఫికేషన్ చేయాలి.

*ఐవీఆర్ హెల్ప్ లైన్ ను తక్షణమే ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు చేసిన వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

*త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షలకు మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాతే విడుదల చేయాలి.

కాగా ఈ ప్రాజెక్ట్ లో గ్లోబరీనా సంస్థ కావాల్సిన సాంకేతికత, మానవ వనరులను సమకూర్చుకోవాలి. ఇంటర్ బోర్డ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలి. కానీ ఈ ప్రక్రియలో గ్లోబరీనా సంస్థ దారుణంగా వెనుకబడిందని నివేదికలో పేర్కొన్నారు.. గ్లోబరీనా సంస్థ పనితీరు దారుణంగా ఉండడం వల్లే ఈ అనార్థాలు జరిగాయని త్రిసభ్య కమిటీ నివేదికలో పొందుపరిచింది.