Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు-చంద్రబాబుకు ఇంత గ్యాప్ ఎందుకు..
By: Tupaki Desk | 29 Oct 2016 1:21 PM ISTనిజమే! ఇప్పుడు ఈ విషయం మీదే అందరూ చర్చించుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య గ్యాప్ భారీ స్థాయిలో పెరిగింది. ఈ విషయం ఏ అప్పోజిషన్ లీడర్లో చెప్పడం లేదు. ప్రముఖ సర్వే నిర్వహణ సంస్థ వీడీపీ అసోసియేట్స్ స్పష్టం చేస్తోంది. దేశంలోని పవర్ ఫుల్ సీఎంల జాబితాలో కేసీఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే - ఏపీ సీఎం చంద్రబాబు అందనంత దూరంలో 7 వ ప్లేస్ లో ఉన్నారని సర్వే సంస్థ చెప్పడం గమనార్హం. ఈ సంస్థ ఇటీవల దేశ వ్యాప్తంగా సీఎంలపై సర్వే చేసి వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. దీని ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత దారుణమైన ర్యాంక్ రావడం గమనార్హం.
వాస్తవానికి తనకన్నా కష్టపడే సీఎం దేశంలో ఇంకెవరూ లేరని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు.. ఎందుకింతలా వెనుకబడి పోయారు. అధికారులు - మంత్రులను సైతం వివిధ పథకాల విషయంలో ఉరుకులు పరుగులు పెట్టించే చంద్రన్న ఎందుకు వెనుకబడి పోయారు. ఎలాంటి హడావుడీ లేకుండా.. ఫాం హౌస్ సీఎంగా పేరుపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి.. కేసీఆర్ ఎందుకు 1వ ప్లేస్ ను ఆక్రమించారు? ఈయనకు కలిసొచ్చిన అంశాలేంటి? బాబుకు కలిసిరాని పరిస్థితులేంటి? ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది.
చంద్రబాబు - కేసీఆర్ లు ఇద్దరూ ఒకే సారి పాలనా పగ్గాలు చేపట్టారు. ఎవరి స్టైల్లో వారు దూసుకుపోయారు. కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెట్టారు. ప్రజలకు చేరవయ్యారు. అయినప్పటికీ బాబుపై వ్యతిరేకత! ఏపీ ప్రజల్లోని ఓ వర్గంలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ విషయంలో బాబు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ముందు ప్రకటనలు చేసిన చంద్రబాబు తర్వాత తన పంథాను యూటర్న్ చేశారు. హోదాతో వచ్చేది ఏమీ లేదని - ప్యాకేజీ ముద్దని ప్రకటించారు.
ఈ పరిణామం కూడా ప్రజలను నివ్వెర పరిచింది. ఇక - ఇసుక కుంభకోణం - కాల్ మనీ వ్యవహారం - ఇటీవల గోదావరి ఆక్వాటెక్ - రాజధాని భూములపై కొన్నాళ్లు జరిగిన రాద్దాంతం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేరుగా దందాలకు తెరదీయడం వంటివి ఆయనపై ప్రభావం చూపి ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఎన్ని పథకాలు ప్రవేశ పెడుతున్నా.. ప్రజల్లో ఆయన కష్టానికి రావాల్సిన మైలేజ్ రావడం లేదన్న టాక్ వస్తోంది. దీనికి తోడు విపక్ష వైకాపా పెద్ద ఎత్తున చేస్తున్న యాంటీ ప్రచారం కూడా బాబును మసకబారేలా చేసిందని చెప్పొచ్చు. ఓటుకు నోటు కేసు దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎంల వరుసలో 7వ ప్లేస్ లో నిలవాల్సి వచ్చింది.
ఇక, కేసీఆర్ విషయానికి వస్తే.. ప్రజల్లో ఆయనపై ఎక్కడా వ్యతిరేకత కనిపించడం లేదు. జిల్లాల ఏర్పాటు విషయంలో కొన్ని చోట్ల అది బయటపడినా కేసీఆర్ తెలివిగా వ్యవహరించి.. ప్రజలు కోరుతున్న జిల్లాలను ప్రకటించేశారు. ఇక, రైతుల ఆత్మహత్యల విషయంలోనూ పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగినా.. అవికూడా గాలికి ఎగిరిపోయేలా చేయగలిగారు. ముఖ్యంగా ఆయన చేపట్టిన మిషన్ భగీరథ - మహారాష్ట్రతో వాటర్ ఒప్పందాలు. ఏపీ విషయంలో కఠినంగా వ్యవహరించడం వంటివి ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగేలా చేశాయి. దీంతోనే ఆయనకు 1వ ప్లేస్ వచ్చిందని భావించాలి. నిజానికి సీఎం హోదాలో కేసీఆర్ పెద్దగా సచివాలయానికి వచ్చింది లేదు. అదేవిధంగా చంద్రబాబు మాదిరి తిరిగిందీలేదు. మరోరకంగా ఆయన ఫాం హౌస్ సీఎం అనే విమర్శను మూటగట్టుకున్నారు. అయినా.. ఆయన అనుసరించిన వైఖరితో ఆయన ప్రజల సీఎంగా అనిపించుకున్నారు. ఇదే బాబుకు, కేసీఆర్ కు తేడా అనే విశ్లేషణలు వస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/