Begin typing your search above and press return to search.

బాబుకు నిద్ర లేకుండా చేస్తున్న ద‌గ్గుబాటి ఎపిసోడ్‌!

By:  Tupaki Desk   |   29 Jan 2019 6:24 AM GMT
బాబుకు నిద్ర లేకుండా చేస్తున్న ద‌గ్గుబాటి ఎపిసోడ్‌!
X
త‌న‌ను వ్య‌తిరేకించి పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి గురించి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పెద్ద‌గా మాట్లాడ‌రు. బాబును ఉద్దేశించి తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికి వాటికి స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌రు. ఎవ‌రిదాకానో ఎందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముఖ్య‌నేత‌గా ఉండి టీఆర్ ఎస్ లోకి వెళ్లిన త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ సంగ‌తే చూద్దాం. బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన త‌ల‌సానిపై బాబు ఒక్క మాట అన్న‌ది లేదు. కనీసం త‌ల‌సాని చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌పై స‌మాధానం ఇచ్చింది లేదు.

అలాంటి చంద్ర‌బాబు తాజాగా త‌న కోబ్ర‌ద‌ర్ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు.. ఆయ‌న కుమారుడు హితేశ్ లు జ‌గ‌న్ పార్టీలో చేర‌నున్న వైనంపై మాత్రం రియాక్ట్ అయ్యారు. ఎప్పుడూ లేనంత ఘాటుగా విమ‌ర్శ‌లు చేసే ప్ర‌య‌త్నం చేశారు. అధికారం కోసం ఎన్ని పార్టీలైనా మార‌తారంటూ ఆడిపోసుకున్న చంద్ర‌బాబు.. ఆయ‌న ఇప్పటికి ఎన్నో పార్టీలు మారిన‌ట్లుగా వ్యాఖ్యానించారు.

అంతేనా.. రాజ‌కీయ విలువ‌లు అంటూ ద‌గ్గుబాటికి లేవ‌న్న తీవ్ర వ్యాఖ్య చేశారు. రాజ‌కీయాల్లో విలువ‌ల గురించి ఎవ‌రు మాట్లాడినా మాట్లాడ‌కున్నా.. చంద్ర‌బాబుకు మాట్లాడే హ‌క్కు లేద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వ‌స్తూ ఉంటుంది. వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించ‌టంలో ఘ‌నాపాఠి అయిన చంద్ర‌బాబు.. విలువ‌ల గురించి మాట్లాడ‌టం అర్థం లేనిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌న‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డే వారికి సైతం కౌంట‌ర్ ఇవ్వ‌ని చంద్ర‌బాబు.. జ‌గ‌న్ పార్టీలోకి ద‌గ్గుబాటి వెళ్ల‌టాన్ని మాత్రం ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ విమ‌ర్శ‌లు చేయ‌టం వెనుక కార‌ణం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. బాబు గుట్టుమ‌ట్టులు ద‌గ్గుబాటికి తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదు. అంతేకాదు.. జ‌గ‌న్ పార్టీలోకి చేర‌టం ద్వారా త‌న‌కు భారీ న‌ష్టం క‌లుగుతుంద‌న్న అంచ‌నా కూడా బాబును భ‌య‌ప‌డేలా చేయ‌ట‌మే కాదు.. ద‌గ్డుబాటి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు పురిగొల్పింద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.