Begin typing your search above and press return to search.

మోడీ ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం ఇదే

By:  Tupaki Desk   |   25 Dec 2019 11:01 AM IST
మోడీ ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం ఇదే
X
ఏడాదిలో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. ఇంకేముంది? మోడీ పని అయిపోయింది. బీజేపీ దూకుడుకు కళ్లాలు పడుతున్నాయి. కమలం రేకులు రాలిపోతున్నాయి.. ఇలా ఎవరికి వారు.. వారికి సంబంధించిన విశ్లేషణల్ని చేసుకుంటూ పోతున్నారు. ఇలా వాదనలు వినిపిస్తున్న వారంతా వాస్తవాల్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నారా? కొన్ని సందర్భాల్లో అలవాటైన కొన్ని మాటలకు తగ్గట్లు విశ్లేషణలు చేస్తున్నారా? అన్నది ఇప్పుడు క్వశ్చన్.

ఏడాదిలో ఐదు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన విధానాన్ని చూసినప్పుడు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. మోడీ బ్యాచ్ ను ప్రజలు తిరస్కరించే కన్నా.. తనకు తిరుగులేదన్నమితిమీరిన ఆత్మవిశ్వాసంతో మోడీ చేసిన తప్పులే ఆ పార్టీకి అధికారం మిస్ అయ్యేలా చేస్తుందన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు దీనికి నిదర్శనంగా చెప్పాలి.

మహారాష్ట్రలో చిరకాల మిత్రుడైన శివసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగి తిరుగులేని అధిక్యతతో రెండు పార్టీలు సీట్లు సాధించాయి. ఎప్పుడూ నెంబర్ టూగానే ఎందుకు ఉండాలి? ఈసారికి మాకు అధికారం ఇవ్వాలన్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు సేన చీఫ్ ఉద్దవ్. పవర్ అన్నది తమ దగ్గర మాత్రమే ఉండాలే తప్పించి.. మిత్రులతో పంచుకోవాలన్న దానికి వ్యతిరేకంగా ఉండే మోడీ మొండితనం చివరకు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లోకి వెళ్లటమే కాదు.. రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చారని చెప్పాలి.

జార్ఖండ్ లోనూ ఇలాంటి పరిస్థితే మిత్రులను వదిలేసి.. సొంతంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న అత్యాశే ఆ రాష్ట్రంలో పవర్ పోవటానికి కారణమైందన్నది మర్చిపోకూడదు. రాష్ట్రం ఏదైనా సరే.. తనతో నడిచే మిత్రుల విషయంలో మోడీ కరకుగా ఉండటమే కాదు.. తన మాటే చెల్లుబాటు కావాలని.. తనదే పైచేయిగా ఉండాలన్న తత్త్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇదే.. మిత్రులను దూరం చేయటమే కాదు.. ఉన్న వారితోనూ పేచీలకు కారణమవుతుందన్నది మర్చిపోకూడదు.

ఇప్పటికైనా పోయిందేమీ లేదు. ఒకప్పుడు బీజేపీని సమర్థించేందుకు మిత్రులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నుంచి నలుగురు మిత్రుల్ని సంపాదించుకోవటాన్ని వాజ్ పేయ్ హయాంలోనూ.. తర్వాత అద్వానీ హయాంలోనూ చూశాం. మోడీ పవర్లోకి వచ్చాక ఉన్న మిత్రుల్ని దూరం చేసుకుంటున్న వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరింతమంది మిత్రుల్ని దగ్గరకు చేర్చుకోకుండా మాకు మేమే మొనగాళ్లమన్న భావనలో నుంచి మోడీ బయటకు రాకుండా.. తనలోని లోపాన్ని సరి చేసుకోకుంటే.. రానున్న రోజుల్లో కమలం పార్టీకి మరిన్ని కష్టాలు ఖాయమని చెప్పక తప్పదు.