Begin typing your search above and press return to search.
జనసేనలో బండ్ల గణేష్ చేరనిది ఇందుకేనట
By: Tupaki Desk | 15 Sept 2018 10:24 AM ISTఅనూహ్య రీతిలో...అంచనాలకు భిన్నంగా సినీ నిర్మాత - నటుడు బండ్ల గణేష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సినీ నటుడు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి అతిపెద్ద వీరాభిమానినని పలు సందర్భాల్లో చెప్పిన ఆయన ఇవాళ కాంగ్రెస్ లో చేరారు. పవన్ కల్యాణ్ ను 'దేవుడు' అని అభివర్ణించే గణేష్ కాంగ్రెస్ రథసారథి రాహుల్ గాంధీ సమక్షంలో ఇవాళ ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అదే సమయంలో తానెందుకు జనసేనలో చేరలేదో క్లారిటీ ఇచ్చారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు తనకు కాంగ్రెస్ పార్టీ అనువుగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు ప్రతిరూపమన్న గణేష్.. పార్టీ కోసం పదవులను సైతం వదులుకున్న రాహుల్ గాంధీ నేతృత్వంతో ఆ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి తనకు అభిమానమని.. అందుకే ఆ పార్టీలో చేరానని చెప్పారు.
తనకు తండ్రి - దేవుడు - గురువు అన్నీ పవన్ కల్యాణేనని బండ్ల గణేష్ చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని.. అందుకే ఆ పార్టీలో చేరానని వివరించారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. సామాన్య కార్యకర్తగా ఉండిపోమన్నా తనకేం అభ్యంతరం లేదన్నారు. తనకు కాంగ్రెస్.. కమిట్మెంట్ ఇవ్వలేదన్న బండ్ల.. ప్రజాసేవ చేసందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యే అవ్వాలన్నదే తన కోరిక - ఆశ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను ఓ రేంజ్ లో అభిమానించే బండ్ల గణేష్ జనసేనలో చేరతారని పవన్ అభిమానులు భావించారు. కానీ ఆయన అనూహ్యాంగా కాంగ్రెస్‌లో చేరడం, పైగా ఎప్పటి నుంచో తనకు ఆ పార్టీ అంటే మమకారం అని చెప్పడం షాకింగ్ గా ఉందని పవన్ ఫ్యాన్స్ వాపోతున్నారు.