Begin typing your search above and press return to search.

3 రాజధానుల బిల్లు రద్దు వెనుక కారణాలేంటి? అసలు జగన్ ప్లాన్ ఏంటి?

By:  Tupaki Desk   |   22 Nov 2021 8:11 AM GMT
3 రాజధానుల బిల్లు రద్దు వెనుక కారణాలేంటి? అసలు జగన్ ప్లాన్ ఏంటి?
X
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకొన్నట్టుగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.ఈ మేరకు అడ్వకేట్ జనరల్ కు హైకోర్టుకు తెలిపారు.

సోమవారం ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం అత్యవసరంగా జరిగింది. ఈ సమావేశంలో మూడు రాజధానులపై ఏపీ సర్కార్ తీసుకొన్న చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా అడ్వకేట్ జనరల్ ఇవాళ ఏపీ హైకోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై జగన్ సర్కార్ ముందుకు పోతామని గతంలో స్పష్టం చేసింది.

అయితే సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకొని ముందుకు సాగకపోవడంతో ఈ బిల్లును రద్దు చేసి కొత్త బిల్లును తీసుకొస్తున్నారని కొత్త బిల్లులో న్యాయ పరమైన చిక్కులు లేకుండా చూసుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త బిల్లు ఆప్షన్లు ఏంటీ? అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాలుగు ఆప్షన్లు జగన్ సర్కార్ ముందు ఉన్నట్టు సమాచారం.

ఆప్షన్1: న్యాయ చిక్కులు రాకుండా 3 రాజధానులకు అనుకూలంగా కొత్త బిల్లును ప్రవేశపెడుతారని సమాచారం.

ఆప్షన్2: టెక్నికల్ గా 3 రాజధానుల పేరు లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం

ఆప్షన్3: పూర్తి స్థాయి రాజధానిగా అమరావతి

ఆప్షన్4: విశాఖలో పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు చేయడం

ఇలా నాలుగు ఆప్షన్లను జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. కొత్త రాజధాని బిల్లులో వీటిని పెడుతారని తెలుస్తోంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా? లేక పూర్తి స్థాయి రాజధానిగా విశాఖను చేస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.