Begin typing your search above and press return to search.

రియ‌ల్ వైసీపీ-ఫేక్ వైసీపీ..ఢీ అంటే ఢీ!

By:  Tupaki Desk   |   4 Feb 2021 9:30 AM
రియ‌ల్ వైసీపీ-ఫేక్ వైసీపీ..ఢీ అంటే ఢీ!
X
అదేంటి? అనుకుంటున్నారా? అధికార పార్టీలో ఇన్ని ఉన్నాయా? అని నోరెళ్ల బెడుతున్నారా? అంటే.. ఔన ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అధికార పార్టీ వైసీపీలో రెండు వ‌ర్గాలు ఉన్నాయ‌నే విష‌యం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆది నుంచి పార్టీ కోసం ప‌నిచేసిన వారు.. రియ‌ల్ వైసీపీ నాయ‌కులుగా ఉన్నారు. వీరు ఎలాంటి ల‌బ్ధినీ ఆశించ‌కుండానే.. వైసీపీ కోసం ప‌నిచేస్తున్న మాట వాస్త‌వం. దివంగ‌త వైఎస్ అనుచ‌రులు చాలా మంది త‌ర్వాత కాలంలో ఆయ‌న కుమారుడు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుదారులుగా మారారు. అంతేకాదు.. జ‌గ‌న్ జైలుకు వెళ్లిన త‌ర్వాత కూడా పార్టీ కోసం ప‌నిచేశారు. ఇక‌, పార్టీ అధికారంలోకి వ‌స్తే.. చాల‌ని ప‌నిచేసిన వారు కూడా ఉన్నారు. వీరంతా రియ‌ల్ వైసీపీ నాయ‌కులు.

ఇక‌, పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎలివేట్ అయిన నాయ‌కులు, ఇత‌ర పార్టీల నుంచి జంప్ చేసి.. వైసీపీ కోసం వ‌చ్చామ‌ని చెప్పుకొంటూ.. నియోజ‌క‌వర్గాల్లో చ‌క్రం తిప్పుతున్న నాయ‌కులు ఉన్నారు. వీరిని ఫేక్ వైసీపీ నాయ‌కులుగా ఆ పార్టీలోని కొంద‌రు పేర్కొంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో పోరు జ‌రుగుతోంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇరు ప‌క్షాలు కూడా పోటా పోటీగా రంగంలోకి దిగుతున్నాయి. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ప‌రిస్థితి క‌నిపిస్తోంది. త‌మ వారితోనే పంచాయ‌తీ పోరులో నామినేష‌న్లు వేయిస్తున్నారు ఫేక్ నాయ‌కులు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి టికెట్లు సంపాయించుకున్నారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న నాయ‌కుల‌ను కూడా ప‌క్క‌నపెట్టిన జ‌గ‌న్ వీరికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు వీరు త‌మ వారిని రంగంలోకి దింపి.. అస‌లు సిసలు వైసీపీ నేత‌ల‌కు ఎగైనెస్ట్‌గా మారిపోయారు. ఫ‌లితంగా వైసీపీ స‌ర్కారు ఆశించిన ఏక‌గ్రీవాలు సాధ్యం కావ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. పంచాయ‌తీ పోరు స్టార్ట‌వ‌గానే ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఏక‌గ్రీవాల‌కు మొగ్గు చూపింది. భారీ ప్ర‌క‌ట‌న‌లు కూడా జారీ చేసింది. అయితే.. ఈ విష‌య‌లో స‌హ‌క‌రించి.. పంచాయ‌తీల‌ను సాధ్య‌మైనంత మేర‌కు ఏక‌గ్రీవాలు చేస్తార‌ని .. నాయ‌కుల‌పై జ‌గ‌న్ ఆశ‌లు ప‌ట్టుకున్నారు.

కానీ, అధినేత ఆశించింది ఒక‌టైతే. నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయి రాజ‌కీయాలు డిఫ‌రెంట్‌ గా సాగుతున్నా యి. ఇప్ప‌టికే పార్టీలో ఉన్న నాయ‌కులు.. మ‌ధ్య‌లో పార్టీలోకి వ‌చ్చిన నాయ‌కులు పోటా పోటీగా ఒకే పంచాయ‌తీకి ఇద్ద‌రేసి చొప్పున సర్పంచ్ అభ్య‌ర్థుల‌ను బరిలోకి దింపుతున్నారు. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు, చిల‌క‌లూరిపేట‌, మ‌చిలీప‌ట్నం, కైక‌లూరు, పెనుకొండ‌.. ఇలా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఫేక్ నేత‌ల‌తో స్థానికంగా పార్టీ ప‌రువు పోతోంద‌నే టాక్ బాహాటంగానే వినిపిస్తోంది. అయినా.. కూడా ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ఈ ప‌రిణామాలు అంతిమంగా పార్టీ అధినేత జ‌గ‌న్ పెట్టుకున్న ఏక‌గ్రావాల కాన్సెప్టును నాశ‌నం చేస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి దీనిని జ‌గ‌న్ ఎలా అడ్డుకుంటారో చూడాలి.