Begin typing your search above and press return to search.

రియాల్టీ షోలో రియల్ షాక్.. హగ్ చేసుకుంటే ముద్దు పెట్టేశాడు

By:  Tupaki Desk   |   19 Oct 2019 7:50 AM GMT
రియాల్టీ షోలో రియల్ షాక్.. హగ్ చేసుకుంటే ముద్దు పెట్టేశాడు
X
ఊహించని షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది ఒక రియల్టీ షోలో. కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన న్యాయమూర్తికి చేదు అనుభవం ఎదురైంది. ఆత్మీయంగా హగ్ చేసుకున్న జడ్జిని బలవంతంగా ముద్దు పెట్టేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ 11లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇండియన్ ఐడల్ 11లో న్యాయనిర్ణేతలుగా ప్రముఖ గాయకులు అను మాలిక్.. విశాల్ దడ్లానిలతో పాటు నేహ కక్కర్ లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాట పాడేందుకు వచ్చిన ఒక గాయకుడు పాట పాడిన తర్వాత తనను గుర్తు పట్టాలన్నారు.
దీంతో ఆమె స్టేజ్ మీదకు వచ్చారు. ఆ సందర్భంగా ఆమె కోసం తాను తెచ్చిన బహుమానాల్ని అందించారు. దీంతో ఆమె ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. దీనికి సదరు కంటెస్టెంట్ ఊహించని రీతిలో ఆమెను బలవంతంగా పట్టుకొని బుగ్గల మీద ముద్దు పెట్టేశారు. ఈ షాకింగ్ పరిణామానికి ఆమె అవాక్కు అయ్యారు.

ఆ వెంటనే రంగంలోకి దిగిన జడ్జిలు.. యాంకర్ ఆ కంటెస్టెంట్ ను షో నుంచి బయటకు పంపించేశారు. అనంతరం మనస్తాపానికి గురైన సదరు జడ్జి షో నుంచి మధ్యలో వెళ్లిపోయారు. దుర్మార్గమైన విషయం ఏమంటే.. సదరు షోను టెలికాస్ట్ చేస్తున్న మీడియా సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేయటంగా చెప్పాలి.

ఒకవేళ అనూహ్య పరిణామం చోటు చేసుకున్నప్పుడు.. ఇలాంటి వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఆ రికార్డును జనాలకు షేర్ చేయటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. నిజంగానే రియాల్టీ షోలో ఈ దారుణ ఘటన జరిగిందా? లేదంటే.. షోకు మరింత పాపులార్టీ తెచ్చేందుకు ఇలా ప్లాన్ చేశారా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సెన్సార్ చేయాల్సిన వాటిని ఎందుకు ప్రోమోల రూపంలో కట్ చేసి ప్రచారానికి పెట్టటం అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పకతప్పదు. మరి.. ఇలాంటి విమర్శలకు సదరు మీడియా సంస్థ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

For Video :

https://www.instagram.com/tv/B3rAS-pFdcc/?utm_source=ig_embed&utm_campaign=dlfix