Begin typing your search above and press return to search.

సినిమాను తలపించేలా ఉన్న రియల్ లవ్ స్టోరీ

By:  Tupaki Desk   |   21 Oct 2021 12:05 PM IST
సినిమాను తలపించేలా ఉన్న రియల్ లవ్ స్టోరీ
X
ఈ మధ్యన విడుదలైన సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ గుర్తుకు వచ్చేలా తమిళనాడులో తాజాగా బయటకు వచ్చిన లవ్ స్టోరీ కనిపిస్తోంది. వీరి కథ గురించి తెలిస్తే.. అప్రయత్నంగా లవ్ స్టోరీ మూవీలోని కష్టాలు కనిపిస్తాయి. తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ఈరోడ్ కు చెందిన 29 ఏళ్ల సెల్వన్.. 23 ఏళ్ల ఇళమతి అనే ఇద్దరు ఒక ప్రముఖ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. ఉద్యోగంలో భాగంగా వారి మధ్య పరిచయం ఏర్పడటం అది కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారటంతోపాటు.. వారు తమ ప్రేమకథకు పెళ్లితో కామా పెట్టాలని భావించారు. ఇందులో భాగంగా తమ కటుుంబాల్లో చెప్పగా.. ఇద్దరి కులాలు వేరు కావటంతో వారిద్దరిని పెళ్లి చేసేందుకు వారు ససేమిరా అనేశారు.

దీంతో.. పెద్దలకు ఇష్టం లేకున్నా.. తామిద్దరం కలిసి బతికి ఉండాలన్న లక్ష్యంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నారు. వారి వైవాహిక జీవితం కొంతకాలం హ్యాపీగానే నడిచింది. తాజాగా వీరు ఎక్కడ ఉంటున్నారన్న విషయాన్ని గుర్తించిన అమ్మాయి తరఫు వారు ఇంటికి వచ్చి.. అబ్బాయిని బాగా కొట్టి.. అమ్మాయిని తమ వెంట తీసుకెళ్లిపోయారు. దీంతో సెల్వన్ పోలీసుల్ని ఆశ్రయించారు. తామిద్దరం మేజర్లమని.. ప్రేమ పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రి ఇళమతి కుటుంబానికి చెందిన అమ్మాయి కావటంతో పోలీసులు సైతం పెద్దగా స్పందించటం లేదన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. తన భార్య ఇళమతి నుంచి తాజాగా వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చిందని.. తనను చంపాలని చూస్తున్నారని.. తనను కాపాడాలని కోరింది. దీంతో మీడియా ముందుకు వచ్చిన సెల్వన్ తమ లవ్ స్టోరీని వెల్లడించారు. పోలీసులు తమ ఫిర్యాదుకు స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు.. సెల్వన్ ఇచ్చిన కంప్లైంట్ ను తీసుకొని విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. కొన్ని కేసుల విషయంలో పోలీసులు స్పందించే తీరుతో పోలిస్తే మాత్రం తాజా ఉదంతంలో మాత్రం తేడా ఉందన్న మాట వినిపిస్తోంది.