Begin typing your search above and press return to search.
అమరావతి పోయింది.. హైదరాబాద్‌లో జోష్.. వీటిలో!
By: Tupaki Desk | 8 Dec 2021 11:37 AM GMT2014లో సమైక్యాంధ్ర ప్రదేశ్ విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని విభజన చట్టంలో స్పష్టం చేశారు.
అయినప్పటికీ 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటించి దాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అక్కడ స్థిరాస్థి వ్యాపారం జోరుగా సాగింది.
కానీ గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించారు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూల్లనూ రాజధానులుగా చేస్తామని బిల్లు కూడా ప్రవేశపెట్టారు. కానీ ఇటీవల దాన్ని రద్దు చేసి మరింత స్పష్టమైన బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. దీంతో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు అమరావతి కోసం భారీ ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమరావతి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. అసలు అక్కడ రాజధాని ఉంటుందా? లేదా? అనే సందిగ్ధంతో అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు నిర్మాణాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ధరలన్నీ పడిపోయాయని సమాచారం. మరోవైపు ఇదే సమయంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా వృద్ధి చెందింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడం అందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారడంతో అక్కడ క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. భాగ్య నగరంలో ఈ ఏడాది మొదటి 11 నెలల్లో 21,988 ఇళ్ల విక్రయాలు జరిగాయని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. గతేడాదితో పోలిస్తే వార్షిక వృద్ధి 16 శాతం నమోదైనట్లు తన నివేదికలో స్పష్టం చేసింది.
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో రూ.11,164 కోట్లు విలువైన లావాదేవీలు జరిగినట్లు వివరించింది. గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల ధరలు సగటున ఆరు శాతం పెరిగినట్లు తెలిపింది. రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఇళ్ల రిజిస్ట్రేషన్ 66 శాతం జరిగినట్లు పేర్కొంది. రు.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య శాతం గతేడాదితో పోలిస్తే 31 నుంచి 34 శాతానికి పెరిగిందని తెలిపింది.