Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో రియల్ వ్యాపారాలు గుల్ల

By:  Tupaki Desk   |   17 April 2022 2:30 AM GMT
హైదరాబాద్ లో రియల్ వ్యాపారాలు గుల్ల
X
హైదరాబాద్ నగరంలో రియల్ బూమ్ పడిపోతోంది. జీవో నెం. 111 రద్దుతో నగరం నడిబొడ్డున ప్లాట్లు కొనేందుకు జనం ముందుకు రావడం లేదు. దీంతో రియల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నగరం మధ్యలో రూ. కోట్లు పెట్టి కొనుగోలు చేసే బదులు శివారు కాలనీల్లో విల్లా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో రియల్ వ్యాపారం గతంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగినా ప్రస్తుతం వెనుకబడిపోతోంది. దీంతో వ్యాపారస్తులు తమ మనుగడ కష్టంగా మారిందని వాపోతున్నారు.

బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఇక్కడ ఒక్క ప్లాట్ తీసుకోవాలంటే రూ. కోట్లలో చెల్లించాల్సిందే దీంతో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాల్లో రియల్ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో రియల్ వ్యాపారులు ప్రజలను ఆకర్షించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జీవో నెం. 111 ఎత్తివేయడంతో శివారు గ్రామాల్లో రియల్ వ్యాపారం పెరిగింది. శివారులో స్థలం చౌకగా వస్తుందని భావించి అందరు శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. దీంతో నగరం మధ్య ఉన్న ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శివారు కాలనీలకు కళ రానుంది. మొత్తం భూములు హాట్ కేకుల్లా అమ్ముడు కానున్నాయని తెలుస్తోంది.

మధ్య తరగతి వారు సైతం తమ ఆశలు నెరవేరేలా హైదరాబాద్ లో ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో రియల్ వ్యాపారం పడిపోయింది. వ్యాపారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వారు ప్రజలను ఆకర్షించేందుకు పలు ఉఛిత సలహాలు ఇస్తూ వారిని తమ మాట వినేలా చేయాలని భావిస్తున్నారు. కానీ ఎవరు కూడా నగరం మధ్యలో కొనే బదులు శివారు కాలనీలో కొనుక్కుంటే మంచిగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జనం రంగారెడ్డి జిల్లాను ఎంచుకుని శివారు గ్రామాల్లో స్థలాలు కొనేందుకే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.

గత రెండేళ్లుగా కరోనా దెబ్బ కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసింది. కరోనా మహమ్మారి దెబ్బకు రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది. రియల్ వ్యాపారులు, బిల్డర్లు నిలువునా మునిగిపోయారు. కరోనా మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రాజెక్టులు వలస కూలీలు లేక ఆగిపోయాయి. చాలా మంది డిమాండ్ లేక ప్రాజెక్టులను ఆపేశారు. పూర్తికి మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. కార్మికుల కొరత.. ఆర్థిక వనరుల లేమి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో అపార్ట్ మెంట్లను కొనేవారే లేక డిమాండ్ పడిపోయింది.దీంతో ఇప్పుడు బతకడానికే జనాలు ప్రాధాన్యం ఇస్తున్నారు. అద్దెకు ఉండడమే ఈ టైంలో మేలని భావిస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ లో కుప్పకూలడానికి సిద్ధమైంది. బిల్డర్లు, రియల్ వ్యాపారులు కూడా ధరలను భారీగా తగ్గించేస్తున్నారు.

జీవో 111 రాకతో ఇప్పుడు తక్కువ ధరకే ఇప్పుడు హైదరాబాద్ శివారులో అపార్ట్ మెంట్లు లభిస్తున్నాయి. ఈ దెబ్బకు రియల్ రంగం కుప్పకూలడం ఖాయమని.. వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.