Begin typing your search above and press return to search.

10 ఏళ్ల కనిష్టం: రియల్ ఎస్టేట్ ఢమాల్

By:  Tupaki Desk   |   18 July 2020 9:00 PM IST
10 ఏళ్ల కనిష్టం: రియల్ ఎస్టేట్ ఢమాల్
X
కరోనా-లాక్ డౌన్ ధాటికి అన్నింటికంటే తీవ్రంగా నష్టపోయింది ఒకటి రియల్ ఎస్టేట్ రంగం కాగా.. రెండోది సినిమా రంగం.. ఈ రెండూ ఇప్పట్లో పునరుద్ధరణ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

తాజాగా 2020 తొలి ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ రంగం కరోనా ధాటికి భారీగా పడిపోయిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదకలో పేర్కొంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అమ్మకాలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయని తెలిపింది.

2019 జనవరి నుంచి జూన్ మధ్య సేల్స్ తో పోలిస్తే ఈసారి 54శాతం తగ్గి 59538 యూనిట్లకు పరిమితమయ్యాయి. లాక్ డౌన్ తర్వాత మరింత క్షీణించాయి. ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, ఫుణే, అహ్మదాబాద్ నగరాల్లో అధ్యయనం చేశారు.

లాక్ డౌన్ వేళ ఏకంగా 84శాతం మేర డిమాండ్ తగ్గడం ఆందోళన కలిగించే పరిణామం. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైల్లో డిమాండ్ పూర్తిగా క్షీణించింది. దాదాపు జీరోకు పడిపోయాయి.

హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు 8334 యూనిట్ల నుంచి 43శాతం పడిపోయి 4782కు చేరుకున్నాయి. దశాబ్దకాలంలో ఇదే కనిష్టం కావడం గమనార్హం.