Begin typing your search above and press return to search.

వీడియో : పునీత్ మరణంపై వార్త చదువుతూ న్యూస్ రీడర్ కంటతడి

By:  Tupaki Desk   |   30 Oct 2021 10:44 AM GMT
వీడియో : పునీత్ మరణంపై వార్త చదువుతూ న్యూస్ రీడర్ కంటతడి
X
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం కన్నడ నాట శోకసంద్రాన్ని మిగిల్చింది. 2021లో జరిగిన అత్యంత దిగ్భ్రాంతికరమైన సెలబ్రిటీ మరణాలలో ఇది ఒకటిగా నిలిచింది. కేవలం 46 ఏళ్ల వయసులోనే సంభవించిన ఈ మరణాన్ని డైజెస్ట్ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు, కానీ కొన్నిసార్లు మనం ఊహించిన దానికంటే వేగంగా కాలం తీసుకుపోతుంటుంది. ప్రజలు దీన్ని తమ హృదయాల్లో తీసుకోలేకపోతున్నారు. దశాబ్దాలుగా పునీత్‌ను అన్ని విజయాలు దరికిచేరాయి. కానీ నటుడి అకాల మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

భజరంగీ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో యష్ - శివరాజ్ కుమార్‌లతో కలిసి పునీత్ రెండు రోజుల క్రితమే డ్యాన్స్ చేశాడు. ఈ పాత వీడియోను కవర్ చూపించిన స్థానిక వార్తా ఛానెల్‌లు, వార్తా విలేఖరులు ఇప్పుడు పునీత్ మరణ విషాద వార్తను తట్టుకోలేకపోతున్నారు. ఈ సమయంలో నిజమైన హృదయ వేదనను అనుభవిస్తున్న వేలాది మంది అభిమానులతో పాటు, ఒక టీవీ యాంకర్ కూడా ఎమోషనల్ అయ్యింది. నటుడి మరణ వార్తను చదువుతున్నప్పుడు ఆమె తట్టుకోలేక ఏడ్చేసింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. పునీత్ మరణ వార్తను ప్రకటిస్తూ ఒక కన్నడ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ కన్నీళ్ల పర్యంతం అవ్వడం కనిపించింది. అనంతరం సిబ్బంది ఆమెను ఓదార్చడం కనిపించింది. ఖచ్చితంగా, పునీత్ మరణం ఇప్పటివరకు జీవించిన గొప్ప నటులలో ఒకరిని మనకు దూరం చేసిందని అతని అభిమానులు బాధ పడుతున్నారు.

ప్రస్తుతం పునీత్ పార్థివదేహాన్ని అభిమానుల నివాళులర్పించేందుకు కంఠీరవ స్టూడియోస్‌లో ఉంచారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అతని రాబోయే సినిమాలు ఇప్పుడు ఆగిపోయాయి. అతని మరణానంతర విడుదల కావాల్సిన చేతన్ కుమార్ యొక్క జేమ్స్.. పవన్ కుమార్ యొక్క ద్విత్వ సినిమాల పరిస్థితి డోలాయమానంలో పడిపోయింది.