Begin typing your search above and press return to search.

హార్ట్​ పేషెంట్లూ.. దయచేసి కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ మ్యాచ్​ చూడకండి

By:  Tupaki Desk   |   16 Oct 2020 3:45 PM IST
హార్ట్​ పేషెంట్లూ..  దయచేసి కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ మ్యాచ్​ చూడకండి
X
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతున్న ఐపీఎల్-2020 రసవత్తరంగా సాగుతున్నది. పోటీలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఉంటే మాత్రం ఆరోజు ప్రేక్షకులకు నరాలు తెగిపోవాల్సిందే. అంత ఉత్కంఠగా సాగుతున్నాయి మ్యాచులు. కేవలం పంజాబ్​ ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ప్రతి మ్యాచ్​లోనూ ఇదే పరిస్థితి. ఆఖరి బంతి వరకు ప్రేక్షకులు టెన్షన్​లో ఉండాల్సి వస్తున్నది.

కచ్చితంగా మ్యాచ్ పంజాబ్ దే అనుకున్న సమయంలో ఏదో ఒక సంచలనం జరిగి చివర్లో పంజాబ్ మ్యాచ్ కోల్పోతోంది. నిన్న బెంగళూరు లతో జరిగిన మ్యాచ్ లో కూడా ఆఖరి ఓవర్లో రెండు పరుగులు కావాల్సి ఉండగా చాహల్ నాలుగు బంతులకు ఒక్క పరుగే చేశాడు. ఐదో బాల్ కు గేల్ రన్ ఔట్ అయ్యాడు. చివర్లో పూరన్ సిక్స్ కొట్టి సరిపోయింది. లేకపోతే ఇక అంతే. అయితే ఈ క్రమంలో పంజాబ్ టీమ్ ఫ్రాంఛైజీ ప్రీతిజింతా ఓ సరదా కామెంట్ చేశారు. ‘దయచేసి గుండెజబ్బు ఉన్నవాళ్లు మా మ్యాచ్​లు చూడకండి’ అంటూ ప్రీతి వ్యాఖ్యానించారు. షార్జాలో గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆర్​సీబీ మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది.

షార్జా స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ తనను కట్టి పడేసిందని ప్రీతిజింతా వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఓ అద్భుత విజయాన్ని తాము అందుకున్నామని చెప్పారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఎంతో అవసరమని అన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఢీ కొట్టి మరీ క్రీజ్‌లో నిలిచారని ప్రశంసించారు. మున్ముందు జరిగే అన్ని మ్యాచుల్లోనూ ఇదే తరహా విజయాన్ని అందుకోవాలని ఆమె అకాంక్షించారు.

చివరి బంతి వరకు టెన్షన్​.. టెన్షన్​
చివరి ఆరు బంతులకు రెండు పరుగులు చేయాల్సిన స్థాయిలో వికెట్‌ను కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠతగా మారింది. నికొలస్ పూరన్ చివరి బంతికి సిక్స్‌ను బాదేంత వరకూ పంజాబ్ టీమ్ మేనేజ్‌మెంట్, సపోర్టింగ్ స్టాఫ్ ఊపిరి పీల్చుకోలేకపోయింది. ఆదివారం జరుగబోయే మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​తో పంజాబ్​ తలపడనున్నది. ఈ మ్యాచ్​ ఎలా ఉంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.