Begin typing your search above and press return to search.
యూనివర్సల్ బాస్ ఆగయా .. అదే స్టామినా.. అదే స్టైల్
By: Tupaki Desk | 16 Oct 2020 4:15 PM ISTయూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ లేకపోవడంతో కొంతకాలంగా ఐపీఎల్ 2020లో మెరుపులు తగ్గాయి. ప్రేక్షకులు కొంత ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యారు. నిన్న బాస్ తిరిగిరావడంతో మళ్లీ ఐపీఎల్‌కు కళ వచ్చింది. గురువారం సాయంత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయంలో గేల్ కీలకపాత్ర పోషించాడు. ఆరంభంలో కొంత స్లోగా ఆడాడు కానీ.. తర్వాత సిక్స్‌ల మోత మోగించాడు. గేల్ అలా అలవోకగా సిక్స్‌లు బాదుతుంటే.. ప్రేక్షకులు ఎప్పటిలాగానే ఎంజాయ్ చేశారు. నిన్న ఆర్సీబీ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. పంజాబ్ విజయంలో గేల్ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఏడు మ్యాచులతో పాటు బెంచ్‌కే పరిమితమైన గేల్.. ఆర్సీబీ పై బరిలో దిగి అభిమానులను అలరించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గేల్ కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆచి తూచి ఆడాడు.
ఇక రన్ రేట్ పెరగాల్సిన సమయంలో తనదైన స్టయిల్ దూకుడు తో సిక్సులు బాది జట్టుకు విజయం అందించాడు. తనలో సత్తా తగ్గలేదని చాటాడు. తన ప్రాముఖ్యాన్ని గుర్తించేలా చేశాడు. 45 బంతుల్లో 53 రన్స్ చేసిన గేల్ పంజాబ్ విజయానికి ఒక్కపరుగు దూరంలో రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో ఐదు సిక్సర్లతో అభిమానులను అలరించిన గేల్ టీ 20 లో అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశాడు. 13,349 పరుగులతో టీ20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పేరొందిన గేల్ బౌండరీల ద్వారానే 10 వేల పరుగులు పూర్తి చేయడం విశేషం. టీ20 లో ఇప్పటి వరకు 1027 ఫోర్లు, 982 సిక్సులు బాదాడు. ప్రస్తుతం గేల్‌తో పాటు కీరన్ పోలార్డ్, షోయబ్ మాలిక్ కూడా పదివేల పరుగులను సాధించారు. కోహ్లీ ఇటీవలే 9 వేల మైలురాయిని చేరుకున్నాడు.