Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్ః ఆర్‌ బీఐకి జ‌రిమానా

By:  Tupaki Desk   |   24 Dec 2016 9:57 AM GMT
నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్ః ఆర్‌ బీఐకి జ‌రిమానా
X
పెద్ద నోట్ల రద్దు కష్టాలు అటు సామాన్యులకు కాదు - ఇటు బ్యాంకు సిబ్బందికే కాదు ఏకంగా ఆర్‌బీఐకి సైతం అనుభ‌వంలోకి వ‌స్తున్నాయి. ఎక్కువ‌గా నోట్లు ముద్రించ‌డం వంటి ప‌ని ఒత్తిళ్ల‌ కార‌ణంగా కాదు. ఏకంగా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన క్ర‌మంలో ఫైన్ చెల్లించాల్సిన స్థాయికి చేరిపోయింది. రద్దైన పాత నోట్లతో వెళుతున్న ఆర్‌ బీఐ కంటైనర్‌ కు ఓవర్‌ లోడ్‌ కారణంగా జరిమానా విధించారు. చత్తీస్‌ ఘడ్‌ లోని భిలాయ్‌ నుండి నాగపూర్‌ కు ఈ నోట్లను తీసుకెళుతుండగా గోండియా జిల్లాలోని దియోరి సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌ టిఓ) అధికారులు కంటైనర్‌ ను నిలువరించి ఫైన్ వేశారు.

ఈ ప‌రిణామంపై ఆర్‌ టీఓ అధికారులు మాట్లాడుతూ ఆ కంటైనర్‌ సామర్ధ్యం 16టన్నుల బరువని - అయితే 21 టన్నులు తీసుకెళుతున్నట్లు తేలిందని వెల్ల‌డించారు. అందుకే డ్రైవర్‌ నుండి రు.30వేలు జరిమానా వసూలు చేశారని ఆర్‌ టీఓ అధికారి తెలిపారు. ఇదిలాఉండ‌గా కొత్త నోట్ల అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ఆర్‌ బీఐ భారీ స్థాయిలో నోట్ల ముద్ర‌ణ చేపడుతోంది. సిబ్బంది లంచ్ - డిన్నర్ బ్రేక్‌ లు కూడా తీసుకోవడంలేదు. అంతేకాదు, సిబ్బంది పని వేళలను కూడా రోజుకు 11 గంటలకు పెంచారు. దేశంలో మొత్తం నాలుగు మాత్రమే కరెన్సీ నోట్ ముద్రణ ప్రెస్‌ లు ఉన్నాయి. వాటిలో రెండు మైసూరులోని రిజర్వు బ్యాంకు వద్ద ఉండగా, మరొకటి బెంగాల్‌ లోని సల్బోని వద్ద, ఇంకోటి నాసిక్‌ లోను ఉన్నాయి. ప్రస్తుతం నాసిక్ ప్రెస్‌ లో ఆదివారాలు కూడా సెలవులు ఇవ్వడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/