Begin typing your search above and press return to search.

ఆర్బీఐ కీలక నిర్ణయం.. క్యూఆర్ కోడ్ లకు చెక్

By:  Tupaki Desk   |   24 Oct 2020 2:00 PM IST
ఆర్బీఐ కీలక నిర్ణయం.. క్యూఆర్ కోడ్ లకు చెక్
X
ఇప్పుడంతా ఆన్ లైన్. డబ్బుల చెల్లింపులు కూడా మొత్తం ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల కోసం పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ (పీఎస్వోస్) కొత్తగా క్యూఆర్ కోడ్ లను ప్రవేశపెట్టబోతోంది. ఈ క్రమంలోనే ఈ క్యూఆర్ కోడ్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ ) నిషేధం విధించింది.

ప్రస్తుతం ఉన్న యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్ కోడ్ లను మాత్రమే కొనసాగించేందుకు అనుమతి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. కేవలం భారత ప్రభుత్వం ఆమోదించిన క్యూఆర్ లే ఇక పనిచేస్తాయి. పీఎస్వో సంస్థలు ఇక నుంచి యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్ కోడ్ లకు మారాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31లోగా అన్ని పీఎస్వోలు యూపీఐ, భారత్ కోడ్ లను మాత్రమే వాడాలని తెలిపింది.

ప్రస్తుతం దేశంలో భారత్, యూపీఐ క్యూఆర్ కోడ్ లతోపాటు ప్రైవేట్ సంస్థలు తమ సొంత క్యూఆర్ కోడ్ లను వాడుతున్నాయి. దుకాణాలు, వ్యాపారులు మొబైల్ చెల్లింపులు సులభతరం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.

ఈ క్రమంలోనే దేశంలో ఇలాంటి క్యూఆర్ కోడ్ వ్యవస్థను సమీక్షించేందుకు వివిధ సూచనలు చేసేందుకు ఆర్బీఐ కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకే ఓన్లీ భారత ప్రభుత్వానికి చెందిన క్యూఆర్ కోడ్స్ ను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలో భారత్ క్యూఆర్ కోడ్, యూపీఐ క్యూఆర్ కోడ్ మాత్రమే కొనసాగుతాయని నోటిఫికేషన్ లో ఆర్బీఐ పేర్కొంది.