Begin typing your search above and press return to search.
ఆర్ బీఐ పాలసీ రివ్యూ .. బ్యాడ్ బ్యాంక్ పై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
By: Tupaki Desk | 5 Feb 2021 12:00 PM GMTరిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రివ్యూలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ గవర్నరు శక్తి కాంతదాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించిందని ఆయన ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.8శాతం నుంచి 5.2శాతానికి తగ్గించారు. తాజా నిర్ణయంతో రెపోరేటు 4 శాతంగా, రివర్స్ రెపో 3.35 శాతంగా కొనసాగనుంది.
అలాగే, బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు అంశంపై శక్తికాంత దాస్ స్పందించారు. ఆర్బీఐ పరపతి ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాలను దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాడ్ బ్యాంకు అంశంపై స్పందించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి అధికారిక ప్రతిపాదన కోసం వేచి చూస్తున్నామన్నారు. ఇప్పటికే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్పీఏలు, మొండి బకాయిల్ని ఈ బ్యాంకుకు తరలించనున్నట్లు వెల్లడించారు. బ్యాంకుల ఖాతాలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బ్యాంకు రీక్యాపిటలైజేషన్ కోసం రూ.20వేలకోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులకు ఎన్పీఏలు, మొండి బకాయిలు పెరుగుతున్నందున బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని పలువురు ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇటీవల బడ్జెట్‌లో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా, ఆర్బీఐ గవర్నర్ కూడా ప్రభుత్వ ప్రతిపాదనకోసం వేచి చూస్తున్నట్లు వెల్లడించారు.