Begin typing your search above and press return to search.

ర‌జాక‌ర్ ఫైల్స్‌... కేసీఆర్, కేటీఆర్‌ పై స్పెష‌ల్ ఫోక‌స్‌

By:  Tupaki Desk   |   30 April 2022 4:46 AM GMT
ర‌జాక‌ర్ ఫైల్స్‌... కేసీఆర్, కేటీఆర్‌ పై స్పెష‌ల్ ఫోక‌స్‌
X
క‌శ్మీర్ ఫైల్స్ సినిమా దేశ‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా క‌శ్మీర్‌లోని ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టేలా ఉండ‌గా మ‌రోవైపు రాజ‌కీయంగా అంతే హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా బీజేపీ వ‌ర్సెస్ బీజేపీయేత‌ర పార్టీలు ఈ సినిమాపై త‌మ‌దైన శైలిలో స్పందించాయి.

తాజాగా బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ర‌జాక‌ర్ ఫైల్స్ సినిమా తీస్తామ‌ని అందులో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ , ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌కు ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాద‌యాత్రి నిర్వ‌హిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ నారాయణపేటలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ, "తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గడీలు బద్దలు కొట్టి, తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేసేది బీజేపీయేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. తెలంగాణలో రాబోయేది డబుల్‌ ఇంజన్ సర్కారే." అని ధీమా వ్యక్తం చేశారు.

దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనే భ్రమల్లో కేసీఆర్‌ ఉన్నారని, కానీ రాష్ట్రంలో హుజూరాబాద్‌, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోనే ప్రజలు టీఆర్‌ఎ్‌సని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని బండి సంజ‌య్ అన్నారు.

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నిర్వహించిన ఆర్మీ గురించి దేశ ప్రజలకు వివరించేందుకు తీసిన యూరీ సినిమాపైనా, కశ్మీరీ పండిట్లపై తీసిన కశ్మీర్‌ఫైల్స్‌ పైనా టీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజ‌య్ విమర్శించారు.

త్వరలో రజాకార్‌ ఫైల్స్‌ తీస్తామని, అందులో కేసీఆర్‌, కేటీఆర్‌ల చరిత్ర కూడా పెడతామని అన్నారు. రంజాన్ పండుగొస్తే... ఇఫ్తార్ పేరుతో బాదం, పిస్తాలు పంచుతూ డ్యూటీలు చేసే విషయంలో వెసులుబాటు కల్పిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... అయ్యప్ప స్వామి, హనుమాన్, శివ భక్తులకు పూజలు చేసుకునేందుకు ఎందుకు వెసులుబాటు ఇవ్వలేదని బండి సంజ‌య్‌ ప్రశ్నించారు.