Begin typing your search above and press return to search.
ప్రత్యేక రాయల సీమ ఉద్యమం ఎత్తుగడా? వాస్తవమా?
By: Tupaki Desk | 12 Dec 2020 9:16 PM IST``మాకు ఇస్తామని చెబుతున్న హైకోర్టు మాకు అవసరం లేదు. మాకు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే కావా లి!`` ఇదీ.. ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమిస్తున్న వారు చేస్తున్న డిమాండ్. అయితే.. సీమ ఉద్యమం ఏ స్థాయిలో ఉంది? ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? నిజంగానే ప్రత్యేక రాయల సీమ కావాలనే డిమాం డ్ క్షేత్రస్థాయిలో వినిపిస్తోందా? అంటే.. ప్రశ్నలు తప్ప.. సమాధానాలు వినిపించడం లేదు. సీమ ఉద్యమం ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఉన్నదే. ఇక్కడి వెనుకబాటు తనం తగ్గేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగు పడేందుకు కూడా సీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
అయితే.. రాను రాను.. ఈ పరిస్థితి మారిపోయింది. ఈ వ్యవహారం వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేసింది. దీంతో ప్రజల్లోనే ప్రత్యేక రాయల సీమపై ఆసక్తి తగ్గిందనే వాదన నిజమైంది. ఇక, తమకు కావాల్సింది.. సాగు, తాను నీరు.. కొన్ని పరిశ్రమలు, ఉపాధి తప్ప ఇంకేమీ లేదని ఇక్కడి వారు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ.. చాలా మంది నాయకులు ప్రత్యేక రాష్ట్రం అంటూ హడావుడి చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం విభజించిన సమయంలోనే.. బైరెడ్డి రాజశేఖరెడ్డి.. ప్రత్యేక సీమ ఉద్యమం అంటూ.. పార్టీ పెట్టి హడావుడి చేశారు. తర్వాత అది ఏమైందో కానీ.. మళ్లీ ఆ ఊసు లేదు.
ప్రస్తుతం బైరెడ్డి బీజేపీలో ఉన్నారు. ఇక, ఇప్పుడు వైసీపీకి చెందిన మాజీ రాజ్యసభసబ్యుడు గంగుల ప్రతాప్ రెడ్డి.. మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి వంటి వారు ఓ పది మంది కలిసి మళ్లీ రాయలసీమ ఉద్యమాన్ని తెరమీదికి తెచ్చారు. పుస్తకాలు రాశారు. అంతేకాదు.. తాము.. తెలంగాణ మాదిరిగా.. సీమ ఉద్య మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. వాస్తవానికి తెలంగాణతో పోల్చదగిన ఉద్యమం అంటూ.. నిజంగానే జరిగి ఉంటే.. ఇప్పటి వరకు సీమ ఉద్యమం వేరేగా ఉండేది. కానీ, ఈ విషయంలో ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలు అవలంభించడం వల్లే.. సీమ ప్రత్యేక రాష్ట్రం ఒక నినాదంగా మిగిలిపోయింది తప్ప.. నిజంలోకి మళ్లలేదని అంటున్నారు పరిశీలకులు.