Begin typing your search above and press return to search.

సీమకు నిర్లక్ష్య శాపవిమోచనం ఎప్పటికి?1

By:  Tupaki Desk   |   29 Jan 2016 5:30 AM GMT
సీమకు నిర్లక్ష్య శాపవిమోచనం ఎప్పటికి?1
X
ఉమ్మడి రాష్ట్రంలో.. విభజన తర్వాత కానీ అన్యాయం జరిగిన.. జరుగుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది రాయలసీమ మాత్రమే. పాలకుల నిర్లక్ష్యానికి తెలుగువారు చెల్లించిన మూల్యం రాష్ట్ర విభజన. గతం నుంచి గుణపాఠాలు నేర్వాల్సిన పాలకులు ఇప్పటికి కళ్లు తెరవకుండా.. అదే నిర్లక్ష్యపు మొద్దు నిద్ర నుంచి బయటకు రాని దుస్థితి. కేంద్రం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 పట్టణాల్ని స్మార్ట్ సిటీలు చేస్తామంటూ ప్రకటించింది.

ఈ ఇరవైలో రెండు ఏపీకి చెందిన పట్టణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి విశాఖపట్నం అయితే..మరొకటి కాకినాడ. టాప్ 20 జాబితాలో ఈ రెండు పట్టణాలకు దక్కిన ర్యాంకు చూస్తే వరుసగా 8.. 14. అంటే.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాలకు చెందిన పట్టణాల్ని స్మార్ట్ నగరాల జాబితాలో ఉండేందుకు వీలుగా ప్రతిపాదనల్ని పంపినా.. అందులో అత్యుత్తమంగా నిలిచిన టాప్ 20కు స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కింది. ఏపీకి రెండు సిటీలు దక్కాయంటే.. ప్రతిపాదనలు పంపే విషయంలో ప్రదర్శించిన ముందుచూపు..జాగ్రత్తే. అయితే.. ఇదంతా ఆంధ్రా ప్రాంతం వైపు మాత్రమే ఉండటం రాయలసీమ పట్ల లేకపోవటం గమనార్హం.

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిన సీమకు తాజా స్మార్ట్ సిటీల ఇష్యూలోనూ అన్యాయం జరిగిందన్న మాట బలంగా వినిపిస్తోంది. అదెలానంటే.. ఏపీ సర్కారు మొత్తం మూడు పట్టణాలు.. విశాఖ.. కాకినాడ.. తిరుపతి పట్టణాల్ని స్మార్ట్ సిటీ ఎంపిక కోసం పంపాయి. అయితే.. మిగిలిన రెండు పట్టణాలకు సంబంధించి ప్రతిపాదనలు.. నివేదికలు స్మార్ట్ గా ఉండగా.. తిరుపతి విషయంలో పంపిన నివేదిక మీద జరిగిన కసరత్తు అసంపూర్ణంగా ఉండటమే టాప్ 20 జాబితాలో ఉండకపోవటానికి కారణం. విశాఖను 8 స్థానంలో నిలిచేలా.. కాకినాడను 14 స్థానంలో నిలిచేలా నివేదికలు సిద్ధం చేసిన ఏపీ సర్కారు.. తిరుపతి విషయానికి వచ్చేసరికి 42వ స్థానంలో నిలవటం గమనార్హం.

ఇక్కడో చిన్న ఉదాహరణలోకి వెళదాం. ఒక విద్యార్థికి అన్ని సబ్జెక్ట్ లలో 90కు పైగా మార్కులు వచ్చి.. ఏదైనా ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందా? అన్నింటిలోనూ 90 మార్కులు రావటమంటే ఆ పిల్లాడిలో సత్తా ఉన్నట్లే. అయినా.. ఫెయిల్ అయ్యాడంటే సదరు సబ్జెక్ట్ బోధించిన టీచర్ ఫెయిల్యూర్ కావటం వల్ల కానీ లేదంటే పిల్లాడు రాసిన ఆన్సర్ షీట్ ను దిద్దిన ఇన్విజిలేటర్ తప్పు చేసి ఉండాలి.