Begin typing your search above and press return to search.
ఈసారికి రాయదుర్గం ఎమ్మెల్యే కాదు.. ఆయన సన్నిహితుడి వార్నింగ్ చూశారా?
By: Tupaki Desk | 6 Sept 2021 10:09 AM ISTతరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ఆయన అనుచర వర్గం. గత ఏడాది ఇసుక యార్డు ఇంఛార్జ్ కు ఫోన్ చేసి దారుణంగా బెదిరించిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చి కలకలం రేపటం తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదంలో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయనకు అత్యంత సన్నిహితుడైన జయరామిరెడ్డి బరితెగింపు ఇప్పుడు షాకింగ్ గా మారింది.
రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఒక కాంట్రాక్టర్.. స్థానిక ఎమ్మెల్యే అయిన కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా ఎలా పని చేస్తారంటూ సూటిగా ప్రశ్నించటమే కాదు..తమ మాట కాదని పనులు చేస్తే.. తమ పిల్లోళ్లను వాయించేమని చెబుతానని.. వారి వాహనాల్ని ధ్వంసం చేయని చెబుతామంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ చూస్తే.. నోట మాట రాదంతే.
తన మాట వినని వారి విషయంలో వెనుకా ముందు లేకుండా బూతుపురాణం విప్పే ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాపురామచంద్రరెడ్డికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆయన ప్రధాన అనుచరుల బరితెగింపు ఉందన్న మాట వినిపిస్తోంది. రాయదుర్గం - కనేకల్ రోడ్డు పనులు ఆపేయాలని.. ఎమ్మెల్యే ఓకే చెప్పిన తర్వాతే పనులు చేయాలని చెప్పిన ఉదంతానికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పడు వాట్సాప్ లో హల్ చల్ చేస్తోంది.
తాము చెప్పినట్లు పనులు ఆపకుండా చేసుకుంటూ పోతే.. భౌతిక దాడులు తప్పవని తేల్చటమే కాదు.. ఏంది.. వీడియో తీస్తున్నావా? అంటూ అక్కడి వారిని బెదిరించటం గమనార్హం. అయితే.. వీడియో తీస్తున్నావా? అన్న వ్యక్తి నిజానికి వీడియో తీయలేదు.
అతడితో సంబంధం లేకుండా మరొకరు వీడియో తీసి గుట్టుగా వాట్సాప్ లో షేర్ చేయటం.. అది కాస్తా వైరల్ గా మారింది. మరి.. దీనిపై అధికారులు.. ఎమ్మెల్యే ఎలా రియాక్టు అవుతారో చూడాలి.