Begin typing your search above and press return to search.

లోకేశ్ 'గ్రేటర్ గురు' ఎవరు?

By:  Tupaki Desk   |   28 Jan 2016 8:37 AM GMT
లోకేశ్ గ్రేటర్ గురు ఎవరు?
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఫలితం ఎంతో తెలియదు కానీ ప్రచార రంగంలోకి దిగిన తరువాత మాత్ర నారా లోకేశ్ స్పీడందుకుంటున్నారు. అంతేకాదు... ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుంటూ చాలా కసరత్తు చేయిస్తున్నారు. తన ప్రసంగాల విషయంలో ఆయన చాలా శ్రద్ధ పెడుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందుతున్నట్లు సమాచారం. మరి ఆయనకు ట్రైనింగు ఇస్తున్న గురువు ఎవరో తెలుసా... ఎవరో కాదు.. టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం లోకేశ్ కు గ్రేటర్ గురువుగా వ్యవహరిస్తున్నారు.

గతంలో టిడిపి చేసిన అభివృద్ధి పనులు, తెలంగాణలో రాజకీయపరిస్థితులపై లోకేష్ కు ఆయన వివరాలు అందిస్తున్నారట. తెలంగాణ టిడిపి సీనియర్ నేత రావులచంద్రశేఖర్ రెడ్డి ప్రతిరోజూ లోకేష్ కు ట్యూషన్ చెప్తున్నారని కొందరు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ రోజుకారోజు కౌంటర్లు, మాట్లాడినదానిపై విశ్లేషణలు అందిస్తూ రావుల తెగ కసరత్తు చేస్తున్నారట. ప్రసంగాలలో లోటుపాట్లు, అధిగమించడం తదితర వాటిపై రావుల సలహాలు సూచనలను లోకేష్ తీసుకుంటున్నారని సమాచారం. అయితే ప్రసంగంలో ఎక్కువ పత్రిక భాషను ప్రయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధ్యమైనంత వరకు మాస్ ను ఆకట్టుకునేందుకు వాడుక భాషనే ఉపయోగించాలని రావుల సూచించారని సమాచారం. మొత్తానికి గ్రేటర్ గురువు నేతృత్వంలో లోకేశ్ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.