Begin typing your search above and press return to search.

డబుల్ సెంచరీ ఫీట్ సాధించిన రవీంద్ర జడేజా

By:  Tupaki Desk   |   4 Oct 2019 11:53 AM GMT
డబుల్ సెంచరీ ఫీట్ సాధించిన రవీంద్ర జడేజా
X
టీమిండియాకు రవీంద్ర జడేజా ఎంత కీలకమో తెలిసిందే. బౌలింగ్ తోనే కాదు బ్యాటింగ్ తో కూడా ప్రత్యర్థులను హడలెత్తిస్తాడు. ఇక ఫీల్డింగ్ లో అయితే అతని విన్యాసాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అందుకే టీమిండియాలో ఇప్పుడు రవీంద్ర జడేజా నెంబర్ 1 అల్ రౌండర్. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో రవీంద్ర జడేజా ఒక రేర్ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా రికార్డులకెక్కాడు.

ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక బౌలర్ హెరాత్ పేరు మీద ఉండేది. హెరాత్ 47 టెస్టుల్లో 200 వికెట్లు తీశాడు. కానీ మన రవీంద్ర జడేజా 44 టెస్టుల్లోనే ఆ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఈ ఇద్దరి తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ (49) టెస్టులు - మిచెల్ స్టార్క్ (50) టెస్టులు - ఇండియా మాజీ ఆటగాడు బిషన్ సింగ్ బేడీ - పాకిస్థాన్ ఆటగాడు వసీం అక్రమ్ (51) టెస్టులతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.