Begin typing your search above and press return to search.

రవిశాస్త్రి - కోహ్లీ ప్లానింగ్ లీక్.. షాకిచ్చిన ఆడియో సంభాషణ

By:  Tupaki Desk   |   4 Jun 2021 3:30 AM GMT
రవిశాస్త్రి - కోహ్లీ ప్లానింగ్ లీక్.. షాకిచ్చిన ఆడియో సంభాషణ
X
ఎక్కడ ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలా కూడా ప్రత్యేకంగా చెప్పాలా? జట్టు వ్యూహాల గురించి.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు ఎలా కళ్లం వేయాలన్న వ్యూహాత్మక అంశాల్ని ఓపెన్ గా మాట్లాడుకోవటం ఎంత పెద్ద తప్పన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తోంది. ఇంగ్లండ్ కు వెళ్లటానికి ముందు ముంబయిలోని టీమిండియా మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

ఇందులో జట్టు కోచ్ రవిశాస్త్రి.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడారు. ఇలాంటి వేళ న్యూజిలాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్లను ఎలా ఔట్ చేయాలన్న అంశంపై వీరిద్దరూ మాట్లాడుకున్నారు. లైవ్ స్టార్ట్ కాలేదనుకున్న భావనతో వీరు మాట్లాడుకున్న మాటలు కాస్తా బయటకు వచ్చేశాయి.

సదరు ఆడియోలో బౌలర్లతో రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేయిస్తే లెఫ్టె హ్యాండ్ బ్యాట్స్ మెన్లపై పైచేయి సాధించొచ్చని అందుకు మహ్మద్ షమీ.. మహ్మద్ సిరాజ్ లను ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా చేయాలన్న ఆలోచన కోహ్లీ చెప్పారు. ఇందుకు రవిశాస్త్రి కూడా ఓకే చెప్పాడు. ప్రత్యర్థి జట్టుపై వీరి వ్యూహం లైవ్ లో బయటకు రావటంతో.. వీరి ప్లాన్ ఏమిటన్నది ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. అయినా.. మీడియా సమావేశానికి ముందు కీలకమైన జట్టు వ్యూహాల గురించి మాట్లాడుకోవటం ఏమిటన్న మాట వినిపిస్తోంది.