Begin typing your search above and press return to search.

టీవీ9 వివాదం: హాజరుకాని రవిప్రకాష్ - శివాజీ..

By:  Tupaki Desk   |   10 May 2019 8:27 AM GMT
టీవీ9 వివాదం: హాజరుకాని రవిప్రకాష్ - శివాజీ..
X
టీవీ9 యాజమాన్య మార్పు వివాదంలో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. సైబరాబాద్ సీసీఎస్ పోలీసుల ఎదుట ఈరోజు విచారణకు టీవీ9 సీ.ఎఫ్.ఓ మూర్తి హాజరయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని రవిప్రకాష్ - శివాజీ - మూర్తిలకు పోలీసులు నిన్ననే నోటీసులు జారీ చేశారు. ఇందులో ఒక్క మూర్తి మాత్రమే పోలీసుల విచారణకు హాజరయ్యారు.

ఒక వేళ రవిప్రకాశ్ - శివాజీ హాజరు కాకుండా మరోసారి సీఆర్పీసీ 41 ప్రకారం మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా పోలీసులు రెండోరోజు టీవీ9 ఆఫీసులో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు - పత్రాలు - హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. అయితే కీలకమైన పత్రాలు - హార్డ్ డిస్క్ లను టీవీ9లో మాయం చేశారని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. మూర్తి తోపాటు కొందరు వ్యక్తులు కీలక డాక్యుమెంట్లు - లాప్ ట్యాప్ లు తీసుకెళ్లినట్లు సీసీ టీవీ పుటేజీ ద్వారా తెలుసుకున్న పోలీసులు శంకర్ అనే వ్యక్తిని దీనిపై అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మూర్తితోపాటు శివాజీ - రవిప్రకాష్ లకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. రవిప్రకాశ్ ఇంటి తలుపులు మూసి ఉండడంతో ఆయన ఇంటి తలుపులకు ఈ నోటీసును అంటించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోసారి సీఆర్పీఎస్ సెక్షన్ 41 కింద నోటీసులను ఈరోజు జారీ చేస్తారని తెలిసింది. ఇప్పుడు కూడా విచారణకు హాజరు కాకపోతే కనీసం న్యాయవాది నైనా విచారణకు రవిప్రకాష్ పంపిస్తారని పోలీసులు భావిస్తున్నారట.. ఈరోజు సాయంత్రం వరకు వేచి చూసి ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పోలీసులు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈకేసు కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ సాయంత్రం తెలిసే అవకాశాలున్నాయి.