Begin typing your search above and press return to search.

పసివాడి ప్రాణం... ఎలుకల పాలు!

By:  Tupaki Desk   |   27 Aug 2015 2:29 AM GMT
పసివాడి ప్రాణం... ఎలుకల పాలు!
X
ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించే ఘటన తాజాగా జరిగింది. అమ్మ కడుపులోనుండి భూమ్మిదకు వచ్చి పట్టుమని పదిరోజుకూడా కాని ఒక పసికందు... ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యంతో మృత్యువడిలోకి చేరింది. అప్పటివరకూ తల్లి ఒడిలో ఉన్న బిడ్డ... మృత్యువడిలోకి చేరేటప్పటికి ఆ సన్నివేశం చూసినవారి గుండెలు బరువెక్కుతున్నాయి. విషయం తెలిసిన వారి ఒళ్లు జలదరిస్తుంది!

గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారం రోజుల వయసున్న పసి బాలుడిని ఎలుకలు పీక్కుని తినేశాయి. గమనించేసరికే పరిస్థితి దారుణంగా ఉండటంతో.. అత్యవసర విభాగానికి చేర్చి చికిత్స అందించారు. అయినా అప్పటికే పసివాడి ప్రాణం ఎలుకల పాలయ్యింది. ఈ సంఘటన జరిగి సుమారు నాలుగు రోజులు కావస్తున్నా... బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు అధికారులు. బిడ్డప్రాణాలు పోవడంతో తల్లితండ్రులు మీడియాకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏస్థాయిలో పరిస్థితులు ఉంటాయో ఈ విషయం తెలిస్తే ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

విషయం తెలుసుకున్న ఏపీ మంత్రులు ఆస్పత్రికి రావడం, సిబ్బందిపై ఫైర్ అవ్వడం, ఆర్.ఎం.ఓ ను సస్పెండ్ చేయడం రొటీన్ గానే జరిగిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రులు ఇలాగే ఉంటున్నాయని పాపం ఆరోగ్య మంత్రిగారికి అప్పుడే తెలిసినట్లుంది. వీరి నిర్లక్ష్యం ఖరీదు తాజాగా ఒక పసివాడి దారుణ మృతి! ఈ పాపం ఎవరిది...