Begin typing your search above and press return to search.

రేషన్ షాపుల ద్వారా చికెన్ - గుడ్లు - చేపలు?

By:  Tupaki Desk   |   20 Dec 2019 11:18 AM GMT
రేషన్ షాపుల ద్వారా చికెన్ - గుడ్లు - చేపలు?
X
మామూలుగా రేషన్ కార్డుపై ఏమొస్తాయి.. బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, నూనె, చక్కెర వంటి సరుకులు గతంలో ఇచ్చేవారు. కేసీఆర్ వచ్చాక ఆయన పుణ్యాన తెలంగాణలో కేవలం బియ్యం, చక్కెరే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు రేషన్ లో సమూల మార్పులు చేయాలని కేంద్రంలోని నీతి అయోగ్ నిర్ణయించింది. పౌష్టికాహార పదార్థాలను అందజేయాలని యోచిస్తోందట..

దేశంలో పెరిగిపోతున్న పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దేందుకు రేషన్ షాపుల ద్వారా చికెన్, గుడ్లు, చేపలు తదితర మాంసాహార పదార్థాలను అందజేయాలని నీతి అయోగ్ యోచిస్తోందట.. తక్కువ ధరకే పేదలకు పుష్టికరమైన ఆహారం అందించేందుకు ఈ ప్రతిపాదన తెస్తోందట..

దేశంలోని చిన్నారులు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని.. చవకగా రేషన్ షాపుల ద్వారా వీటిని పంపిణీ చేయాలని నీతి అయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ర అన్నారు. దేశంలో కల్తీ పదార్థాల వల్ల ప్రజలు రోగాల బారిన పడి వైద్యానికే ఖర్చు చేస్తున్నారని..సబ్సిడీ ద్వారా నాణ్యమైన మాంసాహారాన్ని అందిస్తే పౌష్టికాహారం లభిస్తుందని ఆయన అన్నారు.

అయితే తొందరగా పాడయ్యే ఈ మాంసాహార పదార్థాలను రేషన్ ద్వారా ఎలా అందజేయాలనే దానిపై తర్జన భర్జన నడుస్తోంది. ఇప్పటికే పౌరసరఫరా భారం అయిన నేపథ్యంలో ఈ ఖర్చును కేంద్రరాష్ట్రాలు భరిస్తాయా లేదా అన్నది తేలాల్సి ఉంది.