Begin typing your search above and press return to search.
అధికార పార్టీ వాల్లే.. హద్దులు దాటిస్తున్నారు..
By: Tupaki Desk | 1 Sept 2020 3:00 PM IST‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనేది పాత సామెత.. ‘అధికారంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి’ అనేది కొత్తగా నడుస్తున్న ట్రెండ్. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన పలువురు నేతలే పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా ఎల్లలు దాటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీ సరుకులను ప్రజలకు అందించాలనే లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారంటున్నారు. డీలర్లను మచ్చిక చేసుకొని ఈ తతంగం అంతా నడుపుతున్నారు.
ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురం, ఎర్రగొండపాలెం ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలోని మండలాల్లో 40 శాతం రేషన్ బియ్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలున్నాయి. ఎక్కువగా గుండ్లకమ్మ నిర్వాసిత, అటవీ సంబంధిత గ్రామాల్లో బియ్యం నల్లబజారుకు తరలుతోందని తెలుస్తోంది. రేషన్ తరలించే వాహనాలకు జీపీఎస్ సిస్టం ఉన్నా.. ఇక్కడి ఏజెన్సీ గ్రామాల్లో సిగ్నల్ ఉండదు. దీంతో అక్కడ ప్రభుత్వ సేవలన్నీ ఆఫ్‌లైన్‌లోనే జరుగుతుంటాయి. రేషన్ దుకాణాల్లోనూ మాన్యువల్‌గా రికార్డుల్లో రాసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని తమ అక్రమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది.
రేషన్ బియ్యాన్ని ప్రజల నుంచి, డీలర్ల నుంచి సేకరించే సమయంలో అక్రమార్కులు నిరంతర నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారిపై పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్ వాళ్లు దాడిచేసినా వాటిని ఎలా ఎదుర్కోవాలి..? ఎలా బయటపడాలి..? అధికారులను ఎలా దారికి తెచ్చుకోవాలి..? కూడా వారికి తెలుసు. అందుకే.. ఎవరికీ దొరకకుండా.. ఒక్క కేసు నమోదు కాకుండా తప్పించుకుతిరుగుతున్నారు. రేషన్ సరుకును రాష్ట్రాలు దాటిస్తున్నారు.
ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారుల్లో కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. అధికార పార్టీ నాయకులని వదిలేస్తున్నారా.. లేక అడిగినకాడికి అందుతున్నాయని వదిలేస్తున్నారా అని విమర్శలు వినిపిస్తున్నాయి. గత వారంలో భగత్‌సింగ్ కాలనీలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంపై సీఐ కేవీ రాఘవేంద్రకు సమాచారం వచ్చింది. ఎస్సైలు కిశోర్‌బాబు, దీపక వెంటనే దాడిచేసి ఆ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వెంటనే రెవెన్యూ శాఖకు ఇన్‌ఫాం చేశారు. అయినా ఆ శాఖ వారు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వండి.. తాము తర్వాత చూసుకుంటామని చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణులు వెల్లువెత్తుతున్నాయి.