Begin typing your search above and press return to search.

కరెంట్ బిల్ ఎక్కువస్తే రేషన్ - పెన్షన్ కట్

By:  Tupaki Desk   |   22 Dec 2019 5:39 AM GMT
కరెంట్ బిల్ ఎక్కువస్తే రేషన్ - పెన్షన్ కట్
X
ఏపీలో ఇన్నాళ్లు అందరికీ అందిన రేషన్ - పెన్షన్ అందేవీ.. కానీ ఇక పై కొత్త నిబంధనలతో అందకుండా పోతాయా అన్న టెన్షన్ జనాలను పట్టిపీడిస్తున్నాయి. పెన్షన్ - రేషన్ కార్డుల్లో అక్రమార్కులను ఏరివేయడానికి జగన్ సర్కారు కరెంట్ బిల్లులకు లంకె పెట్టింది.

ఆహార భద్రత నియమాల్లో జగన్ సర్కారు సవరణలు చేస్తోంది. అర్హులు కాని వారిని తొలగించడానికి కరెంట్ బిల్లును ప్రమాణికంగా తీసుకుంది. ఇక టాక్సీ - ఆటోలు - ట్రాక్టర్ ఉన్నవారు ఫోర్ వీలర్ ఉన్నా వారికి కూడా రేషన్ కట్ చేయడానికి సిద్దమైంది.

200 యూనిట్లు కరెంట్ వాడకం పెరిగితే వారికి రేషన్ - 300 యూనిట్లు దాటితే వారికి పెన్షన్ కట్ చేసేలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శరాఘాతంగా మారింది. గ్రామ వలంటీర్లు ఈ కరెంట్ బిల్లులకు అనుగుణంగా రేషన్, పెన్షన్ కట్ చేసే బాధ్యతను తీసుకున్నారు.

ఈ పరిణామంతో అద్దెకు ఉంటున్న వాళ్లు ఎక్కువ కరెంట్ వాడినా అది ఓనర్లకు భారమై వారి పెన్షన్ - రేషన్ కట్ అయిపోతుందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సొంతిళ్లు అద్దెకిచ్చే వారికి పెన్షన్ - రేషన్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.