Begin typing your search above and press return to search.

మీరు కలలో కూడా ఊహించని ఉద్యోగమిది

By:  Tupaki Desk   |   22 Nov 2015 4:05 AM GMT
మీరు కలలో కూడా ఊహించని ఉద్యోగమిది
X
ఇదో చిత్రమైన ఉద్యోగం. కోట్లాది మందికి అసలు ఇలాంటి ఉద్యోగం ఒకటి ఉంటుందన్న ఆలోచన కూడా రాదేమో. కలలో కూడా ఊహించని ఈ ఉద్యోగం కోసం కొద్ది నెలల క్రితం ఉత్సాహవంతులైన వారిని ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చారు. ఈ ఉద్యోగం చేసేందుకు దేశ.. విదేశాల నుంచి అప్లికేషన్లు వస్తున్నాయట. ఇంతకీ ఈ ఉద్యోగం ఏమిటి? ఎక్కడ దీన్ని ఆఫర్ చేశారు? లాంటి ప్రశ్నలు మీ మదిలోకి వచ్చేస్తున్నాయా? అక్కడికే వస్తున్నాం.

ఈ చిత్రమైన జాబ్ పేరు ‘ప్రాస్టిట్యూట్ టెస్టర్’. జాబ్ ప్రొఫైల్ విన్న వెంటనే ఉద్యోగం ఎలాంటిదో సగం అర్థమై ఉంటుంది. మిగితా సగం గురించి చెప్పాలంటే.. ఉదయాన్నే లేచి.. తయారై ఆఫీసుకు వెళ్లటం లాంటిదే కానీ.. ఈ జాబ్ చేసే వారు ‘పని’ కోసం ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. రోజూ.. రకరకాల వభ్యిచారుల వద్దకు వెళ్లటం.. వారితో ‘సెక్స్’ చేయటం.. వారిచ్చే అనుభూతి.. వారి పనితనం.. లాంటి విషయాలకు సంబంధించిన రివ్యూ రాయటం.. దాన్ని వెబ్ సైట్ లో పోస్ట్ చేయటమే ఈ ఉద్యోగ ధర్మం.

ఈ ఉద్యోగం మగాళ్లకే కాదు.. ఆడోళ్లకు కూడా సుమా. మగాళ్లు ఆడోళ్ల వద్దకైతే.. ఆడ ఉద్యోగినులు మగ విటుల వద్దకు వెళ్లి ఉద్యోగ ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం కోసం ప్రకటన ఇచ్చింది జర్మనీకి చెందిన ఒక వెబ్ సైట్ సంస్థ. ఇక.. ఈ ఉద్యోగం చేయటానికి అర్హత ఏమిటంటే.. ఆరోగ్యంగా ఉండటం.. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంకపోవటం.. జర్మన్ తో పాటు ఫ్రెంచ్ భాష తెలిసి ఉండటం.. విషయాన్ని రాయగలిగిన నైపుణ్యం ఉండాలట. వ్యభిచారుల వద్దకు వెళ్లినప్పుడు వారి సర్వీస్ ఎలా ఉంటుందన్న విషయంతో పాటు.. వారు పాటించే శుభ్రత.. తీసుకునే జాగ్రత్తలతో పాటు.. వారి ఆరోగ్య పరిస్థితిని వివరించటం.. వారి నైపుణ్యాన్ని గుర్తించి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఉద్యోగం ప్రొఫైల్ కు స్పందన ఉందా? అంటే.. ఇప్పటివరకూ 156 మంది వరకూ అప్లై చేసుకున్నారట. ఈ ఉద్యోగం కోసం జర్మనీ నుంచి మాత్రమే కాక బెల్జియం.. నెదర్లాండ్స్.. బ్రిటన్ నుంచి పలువురు ఆసక్తి ఉన్న వారు అప్లై చేసినట్లుగా చెబుతున్నారు. ఉద్యోగం అంటే ఏమో అనుకుంటారు కానీ.. ఇలాంటిది కూడా అని అనుకోవచ్చు కానీ ఇది నిజం. వెతికి చూస్తే.. ఇలాంటి చిత్రవిచిత్రమైన ఉద్యోగాలు ఇంకెన్ని ఉంటాయో..?