Begin typing your search above and press return to search.

టీవీ సీరియల్ చూసి హత్యానేరం ఎస్కేప్ ప్లాన్

By:  Tupaki Desk   |   29 March 2020 11:00 PM IST
టీవీ సీరియల్ చూసి హత్యానేరం ఎస్కేప్ ప్లాన్
X
మహారాష్ట్రలోని హంగార్గ్ ప్రాంతంలోని షోలాపూర్ రోడ్ కు చెందిన రసూల్ కూలీగా పనిచేస్తుండేవాడు. ఎన్నాళ్లిలా కూలీ బతుకు అని మరో ఇద్దరితో కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు. పెట్రోల్ బంక్ 3.2 లక్షల డబ్బులను కొట్టేసి పారిపోయాడు. పోలీసులు పట్టుకొని జైలుకు పంపారు. ఎలాగోలా జైలు నుంచి వచ్చిన రసూల్ కోర్టుకు హాజరవుతున్నాడు. తనకు శిక్ష ఖాయం అని తేలడంతో ఆందోళన చెందాడు. హిందీలో వస్తున్న ఒక ఫేమస్ క్రైం సీరియల్ చూసి సేమ్ అలానే ప్లాన్ చేశాడు.

తన సొంతూరు అంబజ్ గోయ్ ప్రాంతానికే చెందిన అలీ ఇస్మాయిల్ షేక్ తో పరిచయం చేస్తున్నాడు. తన లాగే ఉన్న అలీ ఇస్మాయిల్ ను చంపి.. తాను చనిపోయానని నమ్మిస్తే జైలు శిక్ష తప్పించుకోవచ్చని స్కెచ్ గీశాడు.

అలీ ఇస్మాయిల్ ను మద్యం తాగుదామని పిలిచి బండరాయితో చంపి ముఖాన్ని గుర్తు పట్టకుండా రాయితో చెక్కేశాడు. తన ఫోన్ - పర్సును ఇస్మాయిల్ పక్కన పడేశాడు..

పోలీసులు హత్య సంఘటనను గుర్తించి ఆధారాల ఆధారంగా రసూల్ చనిపోయాడని అతడి భార్యకు శవాన్ని అప్పగించారు. భార్యకు తన ప్లాన్ ముందే చెప్పి హైదరాబాద్ పారిపోయాడు రసూల్.

అయితే రసూల్ పారిపోతూ సీసీటీవీ కెమెరాలో చిక్కాడు. ఒక వ్యక్తి నుంచి హైదరాబాద్ లో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఇక్కడే పోలీసులకు దొరికిపోయాడు.

ఇస్మాయిల్ కనిపించడం లేదని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం.. రసూల్ భార్య సంతోషంగా ఉండడం చూసి అనుమానం వచ్చిన పోలీసులు తీగ లాగితే ఢొంక కదిలింది. హైదరాబాద్ లో ఉంటున్న రసూల్ ను ఇక్కడి పోలీసుల సాయంతో పట్టుకొని కోర్టులో హాజరు పరిచారు. విచారణలో హిందీ సిరియల్ చూసే తాను ఈ హత్య చేశానని రసూల్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.