Begin typing your search above and press return to search.
ఎంఎస్ ధోనిని దించేసిన రషీద్ ఖాన్.. హెలిక్యాప్టర్ షాట్ వైరల్
By: Tupaki Desk | 25 Aug 2021 4:13 PM ISTటీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ కు ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన మాత్రమే కొట్టే హెలిక్యాప్టర్ షాట్ కు బంతి బౌండరీ దాటాల్సిందే. అంతలా ఫేమస్ అయిన ఆ షాట్ ను తాజాగా ఇంగ్లీష్ టీ20లో కొట్టేశాడు అప్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్.
ఇంగ్లీష్ టీ20లో ససెక్స్ టీం తరుఫున ఆడుతున్న రషీద్ ఖాన్ నిన్న రాత్రి ఎంఎస్ ధోని హెలిక్యాప్టర్ షాట్ ను కొట్టాడు. దీంతో ధోని అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను ఈసీబీ తన అధికారిక సోషల్ మీడియాలో పంచుకుంది.
రషీద్ ఖాన్ ఇంగ్లండ్ దేశీయ టీ20 టోర్నీలో ససెక్స్ తరుఫున ఆడుతున్నారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోతున్న ససెక్స్ ను తన బ్యాటింగ్ తో రషీద్ ఖాన్ గెలిపించాడు. కేవలం 9 బంతుల్లోనే 27 పరుగులు చేసి 178 పరుగుల లక్ష్యాన్ని చేధించాడు. యార్క్ షైర్ ను గెలుపు నుంచి ఓటమి దిశగా మార్చి సాగనంపాడు.
ఎంఎస్ ధోని హెలిక్యాప్టర్ షాట్ ను రషీద్ వాడడం ఇదే తొలిసారి కాదు.. ఇది వరకూ కూడా ఈ టోర్నమెంట్ లో ఆడాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలోని బీబీఎల్ లాంటి ఇతర టీ20లీగ్ లలో కూడా చాలా సార్లు కూడా ఇలాంటి షాట్ లు ఆడాడు.