Begin typing your search above and press return to search.

ప్లీజ్..నా దేశాన్ని కాపాడండి : స్టార్ క్రికెటర్ !

By:  Tupaki Desk   |   27 Aug 2021 6:30 AM GMT
ప్లీజ్..నా దేశాన్ని కాపాడండి : స్టార్ క్రికెటర్ !
X
ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్‌ లో జరిగిన పేలుడుతో ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ , స్టార్ అల్ రౌండర్ , స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు. ఆ ఘటన పై స్పందిస్తూ ఆఫ్గన్‌లను చంపడం ఆపండి’ అని పార్తిస్తున్నాడు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాబూల్‌లో మళ్లీ రక్తస్రావం అవుతోంది. దయచేసి ఆఫ్గన్‌ లను చంపడం ఆపండి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో మమ్మల్ని వదలకండి అంటూ చాలా భాదగా తన దేశం పై ఉన్న ప్రేమని చాటుకున్నాడు.

ఫిదాయీన్ దాడుల్లో 80 మందికి పైగా మృతిచెందారు. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ముందు గురువారం సాయంత్రం రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఈ పేలుళ్లలో దాదాపుగా 80 మంది కన్నుమూశారు. అలాగే, ఇందులో 200 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో 12 మంది యూఎస్ మెరైన్ కమాండర్లు కూడా ఉన్నారు. వీరితో పాటు 15 మంది గాయపడ్డారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐ ఎకు చెందిన ఖోరాసన్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు వెల్లడించింది.

మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు. కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఐసిస్‌ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కొద్ది గంటల ముందే బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియాలు హెచ్చరించాయి. అఫ్గాన్‌ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉండడంతో ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులను తాలిబన్లు ఖండించారు.

కాబూల్‌ జంట పేలుళ్ల ఘటనను అమెరికా తీవ్రంగా చూస్తుంది. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వెంటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేలుళ్లలో మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా బైడెన్ అభివర్ణించారు. ఈ దాడుల్లో మృతి చెందిన వారికి సంఘీభావంగా కొద్దిసేపు మౌనం పాటించారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టారని బైడెన్ కీర్తించారు. కాబూల్‌ నుంచి భద్రతా దళాల తరలింపు ప్రక్రియ ఆగదని స్పష్టం చేశారు. కాబూల్ ఆత్మాహుతి దాడులను నాటో, ఐరాస ఖండించాయి. నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోటెన్‌బర్గ్‌, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌లు ఈ దాడులను ఖండించారు. కాబూల్‌ ఉగ్రదాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ఉగ్రవాదంపై ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా పేలుళ్లు చాటుతున్నాయని చెప్పుకొచ్చింది.