Begin typing your search above and press return to search.

యుఎన్ఎస్సి లో రెపరెపలాడిన లో భారత మువ్వన్నెల జెండా .. అరుదైన గౌరవం !

By:  Tupaki Desk   |   26 Jan 2021 8:30 AM GMT
యుఎన్ఎస్సి లో రెపరెపలాడిన లో భారత మువ్వన్నెల జెండా .. అరుదైన గౌరవం !
X
ఈ రోజు మనందరం 72వ గణతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా జాతీయ పతాకన్ని ఎగరవేయడం ఆనవాయితీ వస్తోంది. జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ చట్టం -1971లోని నిబంధనల ప్రకారంజాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్య్ర యోధులను గౌరవించడం పౌరుల ప్రాధమిక విధి. ఈ రోజు మన భారత మువ్వెన్నల జెండా దేశంలో రెపరెపలాడుతోంది. దేశంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే .. మాన జాతీయ పతాకానికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి )లో భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అరుదైన అంశం మన భారతీయులకు గర్వకారణం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లోని భారత దేశ ప్రాంగణంలో మన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇకపై మన మువ్వన్నెల జెండా ఎప్పటికీ అక్కడే ఉంటుంది. ఇండియాకి దక్కిన ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకోవాల్సిన అంశం. జనవరి 4న భారత జెండాను ఏర్పాటు చేయడానికి ఓ ముఖ్య కారణం కూడా ఉంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ 8వ సారి అశాశ్వత సభ్యదేశంగా చేరిన సందర్భంగా జెండాను ఆవిష్కరించారు.

ఇండియా 8వ సారి సభ్యత్వాన్ని పొందింది. ఈ సందర్భంగా భద్రతామండలిలో భారత్ తరపున శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి మాట్లాడారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనీ..ఇది నా దేశానికేకాదు..ఇక్కడి మా టీమ్ కు కూడా చాలా గర్వకారణమని తెలిపారు. భద్రతా మండలిలో నా దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం నాకు కలిగించినందుకు భారత ప్రధానమంత్రికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అని భద్రతామండలిలో భారత్ తరపున శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి తెలిపారు.