Begin typing your search above and press return to search.

రేర్ సీన్: ఒకే ఓవర్లో రెండు నోబాల్స్.. అసలు విషయం ఏమంటే?

By:  Tupaki Desk   |   9 Dec 2022 4:36 AM GMT
రేర్ సీన్: ఒకే ఓవర్లో రెండు నోబాల్స్.. అసలు విషయం ఏమంటే?
X
టీమిండియా ఆడిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో పసికూన చేతిలో ఓటమి పాలు కావడం తెలిసిందే. సంచలన విజయాల్ని నమోదు చేస్తూ.. డేంజరస్ జట్టుగా పేరున్న బంగ్లా..

అందుకు తగ్గట్లే ప్రత్యర్థి జట్టు ఏదన్నది పట్టించుకోకుండా ఆడేయటం.. అనూహ్య విజయాల్ని నమోదు చేయటం వారికి అలవాటే. తాజాగా బంగ్లా మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఈ పరిణామం అభిమానుల్లో ఆసక్తిని పెంచటమే కాదు.. మ్యాచ్ లో మరేం జరుగుతుందన్న ఉత్కంటను నింపింది.

ఇంతకూ అసలేం జరిగిందంటే.. ఒకే ఓవర్లో రెండు వరుస బంతుల్లో నో బాల్స్ వేయటం పెద్ద విషయమే కాదు. కానీ.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. వరుస నో బాల్స్ రెండు ఒకేలా ఉండటం ఒక విశేషంగా చెప్పాలి. బ్యాటింగ్ లో రాణించి.. జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ చేసేందుకు తన వంతుగా ఆడారు మెహిదీ హసన్ మిరాజ్. బ్యాట్స్ మెన్ గా మాత్రమే కాదు బౌలింగ్ లోనూ రాణించారు.

అయితే.. మ్యాచ్ లోని 21వ ఓవర్లో అతను బౌలింగ్ చేయటం.. ఆ సందర్భంగా రెండు వరుస బంతులు నో బాల్ అయ్యాయి. కారణం.. బౌలింగ్ చేసే వేళలో మెహిదీ కాలు స్టంప్స్ కు తాకింది. దీంతో అంపైర్ నో బాల్ గా ప్రకటించారు. ఇలా ఒకేలాంటి తప్పుతో నో బాల్ వేయటం చాలా అరుదుగా జరిగే అంశమంటున్నారు. బౌలర్ తప్పిదంతో రెండు బంతులు అదనంగా దొరికినప్పుడు బాదేస్తారు.

తాజా ఎపిసోడ్ లో మాత్రం మొదటి నో బాల్ కుఒక పరుగు మాత్రమే రాగా.. రెండో బంతిని మాత్రం బౌండరీకి తరలించటంలో టీమిండియా జట్టు అభిమానులు ఆనందానికి గురయ్యారు. మొదటి బంతిని అక్షర్ పటేల్ ఎదుర్కొంటే.. రెండో బంతిని మాత్రం శ్రేయస్ బౌండరీకి బాదేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్ లో పోస్టు చేశారు. ఏమైనా బంగారం లాంటి అవకాశంతో వీలైనంత ఎక్కువగా పిండాల్సినప్పటికీ అలాంటిదేమీ లేకపోవటం టీమిండియా అభిమానులకు కాస్తంత నిరాశ కలిగించే అంశంగా చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.