Begin typing your search above and press return to search.

అరుదైన ఘనత మన సొంతం.. సైబర్ సెక్యురిటీలో అత్యుత్తమ స్థానం

By:  Tupaki Desk   |   1 July 2021 2:00 PM IST
అరుదైన ఘనత మన సొంతం.. సైబర్ సెక్యురిటీలో అత్యుత్తమ స్థానం
X
అరుదైన ఘనతను సొంతం చేసుకుంది మన దేశం. సైబర్ సెక్యురిటీ ప్రమాణాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి ర్యాంకుు సొంతం చేసుకోవటం విశేషం. ఏడాది క్రితం వరకు ఎక్కడో నలభయ్యో స్థానానికి కాస్త దగ్గర్లో ఉన్న స్థానే.. ఇప్పుడు ఏకంగా టాప్ 10లోకి దూసుకెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది.

ప్రపంచ దేశాల్లో టాప్ 10 స్థానాన్నిచేజిక్కించుకోవటం చూస్తే.. స్వల్ప వ్యవధిలోనే ఐటీ సూపర్ పవర్ దిశగా భారత్ అడుగులు వేస్తుందని చెప్పాలి. డేటా గోప్యత.. పౌరుల ఆన్ లైన్ హక్కులకు బలమైన చర్యలు తీసుకోవటం కూడాతాజా స్థానానికి చేరుకోవటానికి కారణంగా చెబుతున్నారు.

ఐదు ప్రమాణాల పని తీరు ఆధారంగా ర్యాంకింకులు ఇచ్చారు. నిపుణులతో లోతైన చర్చల ద్వారా మాత్రమే ర్యాంకుల్ని ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో మొదటి స్థానం ప్రపంచానికి పెద్దన్న అమెరికా నిలవగా.. రెండో స్థానంలో బ్రిటన్.. సౌదీ అరేబియాలు నిలిచాయి. మూడో స్థానంలో ఈస్తోనియా నిలిచింది.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ నాలుగో స్థానంలో నిలవగా.. ప్రపంచ స్థాయిలో చూస్తే టాప్ 10లో నిలిచింది. సైబర్ భద్రతకు సంబంధించి అన్ని అంశాల్లోనూ మన దేశం గణనీయమైన మార్పును సాధించినట్లుగా తేల్చారు.

మొత్తం 100 పాయింట్లకు 97.5 పాయింట్లు పొంది టాప్ 10లోకి దూసుకెళ్లింది. ఏడాదిలో వచ్చిన మార్పును చూసినప్పుడు..రానున్న రోజుల్లో మరింత మెరుగైన ర్యాంకును సొంతం చేసుకునే వీలుందని చెప్పకతప్పదు.