Begin typing your search above and press return to search.

సృష్టికి విరుద్దంగా పుట్టి గిన్నీస్ రికార్డ్ సంపాదించిన అరుదైన బిడ్డ

By:  Tupaki Desk   |   12 Nov 2021 10:30 AM GMT
సృష్టికి విరుద్దంగా పుట్టి గిన్నీస్ రికార్డ్ సంపాదించిన అరుదైన బిడ్డ
X
సాధారణంగా పిల్లలు పుట్టడం అనేది తొమ్మిదో నెలలో జరుగుతుంది. ఇది సర్వ సాధారణ ప్రక్రియ. అయితే ఇందుకు భిన్నంగా కొంతమంది ఎనిమిదో నెలలో కానీ లేకపోతే ఏడో నెలలో ఐనా పుడతారు. అయితే వీరిలో చాలా మంది కొంత మేర అనారోగ్యానికి గురవుతుంటారు. ప్రధానంగా బరువు పెరగకపోవడం, అవయవాలు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవడం లాంటి సమస్యలు ఉంటాయి. కానీ అమెరికాలో ఓ చిన్నారి మాత్రం కేవలం ఐదు నెలలకే జన్మించాడు. మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలతో బయట పడ్డాడు. సృష్టికి విరుద్ధంగా జరిగిన ఈ ఘటన గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించింది. కేవలం ఐదు నెలలకే బిడ్డ పుట్టి బతకడంతో చిన్నారి పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి అధికారులు ఎక్కించారు.

అమెరికాలోని అలబామా జిల్లాలో మిచెల్ బట్లర్ అనే వివాహిత గర్భం దాల్చింది. అయితే వివిధ ఆరోగ్య కారణాల రీత్యా ఆమెకు అత్యవసర సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో కడుపులో ఉన్నటువంటి బిడ్డను తీసివేయాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. దీనికి ఒప్పుకొని మిచెల్.. కచ్చితంగా తాను బిడ్డకు జన్మనిచ్చి తీరాలని పట్టుబట్టింది. దీంతో చేసేదేమీ లేక వైద్యులు ఆమె చెప్పినట్లుగానే సర్జరీ చేసి 5 నెలలోనే బిడ్డను బయటకు తీశారు.

విచిత్రంగా ఈ బిడ్డ సుమారు అయిదు నెలల ముందే జన్మించాడు. సాధారణంగా ఇలాంటి పిల్లలు పుట్టిన వెంటనే చనిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి శిశువుల్లో జన్యుపరమైన ఇబ్బందులు ఉంటాయి. దీనితో పాటు వారి అవయవాలు పూర్తిగా పరిపక్వత చెందవు. ఈ కారణాలో చాలామంది పుట్టిన వెంటనే చనిపోతారు. కానీ ఈ బాలుడు మాత్రం మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాన్ని నిలుపుకున్నాడు. సర్జరీ పూర్తయిన తర్వాత శిశువు గుండె ప్రతిస్పందించడం ప్రారంభించిందని వైద్యులు చెప్పారు. దీంతోనే తాము బిడ్డను కాపాడడం మరింత సులభమైందని పేర్కొన్నారు.

శిశువు బయటకు తీయడానికి మాత్రం తాము చాలా కష్టపడినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో ఈ బిడ్డను కోలుకోవడానికి 275 రోజులు పట్టిందని వైద్యులు చెప్పారు. ఈ సమయం అంతా చిన్నారి ఐసీయూలోనే గడిపినట్లు పేర్కొన్నారు. కొన్ని నెల కంటే ముందుగా జన్మించిన శిశువులు సాధారణంగా చాలా తక్కువ బరువు ఉంటారు. అయితే ఈ చిన్నారి కూడా పుట్టినప్పుడు 420 గ్రాములు మాత్రమే ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. కానీ కొన్ని రోజులకే బరువు తో పాటు వ్యాధినిరోధక శక్తిని కూడా శిశువు పెంచుకున్నట్లు వైద్యాధికారులు చెప్పారు.

ఐసీయూలో ఉన్నంతకాలం చిన్నారికి కృత్రిమ శ్వాసను అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే మూడు నెలల తర్వాత శిశువు స్వయంగానే ఊపిరి పీల్చుకోవడం గమనించిన సిబ్బంది వెంటిలేటర్ ను తొలగించినట్లు వివరించారు. అనంతరం సంబంధిత వైద్య పరీక్షలను చేసిన అధికారులు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని గుర్తించారు. ఇలా చిన్నారిని కంటికి రెప్పలా కాచుకున్న ఆసుపత్రి సిబ్బంది.. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ లో డిశ్చార్జ్ చేశారు.

శిశువు ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ అవన్నీ సర్దుకుంటాయని చెబుతున్నారు అప్పటికి పూర్తిస్థాయిలో కోలుకోక పోతే తిరిగి చిన్న చిన్న సర్జరీలను చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. ఏదేమైనా ఐదో నెలకే పుట్టిన బిడ్డ బతకడం నిజంగా రికార్డ్. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సిబ్బంది చిన్నారి పేరును రికార్డ్స్ లోకి ఎక్కించారు.